Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Sri Datta Anagha Lakshmi Vratam Manasa Pooja by Sri Ganapathy Sachchidananda Swamiji

Автор: Avadhoota Datta Peetham

Загружено: 2020-02-05

Просмотров: 83448

Описание:

Sri Datta Anagha Lakshmi Vratam by Sri Ganapathy Sachchidananda Swamiji

https://www.dattapeetham.org/anagha-v...

What is Anagha Vrata?

Lord Dattatreya as Anagha Swami and and his consort Anagha Devi along with the Ashta Siddhis (the 8 Cosmic Powers) who are their sons are worshipped in the powerful Anaghashtami Vrata.

The details about this vrata are given in the Datta Purana compiled by Sage Vēda Vyāsa. Lord Dattatrēya Himself initiated the emperor Kartaveryarjuna into this worship. King Dasaratha and Lord Sri Rāma had also performed this puja. Sri Krishna had Dharmarāja perform it.

Benefits
Agha is sin. Anagha is one who removes sin. The sins that we commit throughout the day and night by thought, word and deed obstruct our path to progress. The Anagha Vratam effectively eradicates our sins.

Performing Sri Anaghastami Vratha with devotion bestows us with the knowledge, good memory power, peace, prosperity, money, energy and strength to face any difficulties.

By performing this worship not only is one relieved of all worldly difficulties and miseries, but one is blessed with prosperity, fulfillment of desires, attainment of spiritual knowledge and ultimately liberation.

It gives peace to oneself and to the world. This ritual’s results are more uniquely beneficial than any other ritual.

పల్లవి:
అనఘమ్మా! అనఘయ్యా!
అనఘుల మము చేయరయ్య!

ధ్యానము :
అరవిచ్చిన పూవులవలె
సిరులి చ్చెడు కన్నులతో
నెరి వెన్నెల నదులై తగు
చిరునవ్వుల జిలుగులతో
ఘనయోగ ద్యుతులీనెడు
కనుబొమ్మల కూడలితో
మాలాంబుజ వరదాభయ
మహితములౌ కరములతో
పద్మాసన సంస్థితిచే
పైకెగసెడు పదరుచితో
మాయక మా మది వెల్గెడు
ఈ యనఘా దంపతులను
మనసారగ ధ్యానించెద
మది నిండుగ భావించెద ...1

పరివారదేవతా ధ్యానము :
అణిమాఖ్యుండీశాన్యము
నందున సేవించు చుండ ...
లఘిమాఖ్యుండాగ్నేయా
లంబనుడై కొల్చుచుండ ...
ప్రాప్తిదేవు డా నైరృతి
భాగమ్మున నిల్చియుండ ...
ప్రాకామ్యుడు వాయుకోణ
పాలకుడై కొల్వుదీర ...
ఈ దక్షిణ భాగమ్మున
ఈశిత్వుడు వెల్గులీన ...
వామంబగు భాగంబున
పరగి వశిత్వుండు మించ ...
కామావ సాయిత్వా
ఖ్యాతుడు వెన్వెనుక నిలువ ...
మునుముందుగ మహిమాఖ్యుడు
ఘనుడై పనులెల్ల దీర్ప ...
అంబుజమున కొలువుండిన
అనఘద్వయి నర్చించెద ...2

ఆవాహనము :
అంతటనూ కొలువుండే
అంతరాత్మ రూపులార!
ఆవాహన మిదే చేతు
ఆకారముతో రండో ...3

ఆసనము :
ఆవాహితు లైనట్టి
ఆది దంపతులారా!
ఆదరమున నా మనసే
ఆసనముగ అర్పించెద ...4

పాద్యము :
ఇలలో జనులందరకూ
ఇడుముల నెడ బాపగల్గు
చరణాబ్జ ద్వంద్వములకు
చల్లని పాద్యమ్ము లిత్తు ...5

అర్ఘ్యము :
ఈడులేని సౌందర్యము
నీను చుండు సొగసులతో
ఈవి ముద్ర వెలయించెడు
ఈ చేతుల కర్ఘ్యమిత్తు ...6

ఆచమనం :
ఉదరములో కొలువుండిన
పదునాలుగు లోకములు
అల్లల్లన చల్లబడ
ఆచమనం బిదే యిత్తు ...7

మధుపర్కం :
ఊపున ఈ లోకమునకు
మా పిలుపున వచ్చు మీరు
పెనుబడలిక శాంతినొంద
గొనుడీ మధుపర్కమయ్య ...8

పంచామృతస్నానం :
ఋణ బంధముల దగిలి
ఋజువర్తన వదలు మాకు
పాపమ్ములు తొలగ మీకు
పంచామృత స్నానమిత్తు ...9

స్నానం :
రూఢిగ ఈ లోకమ్ములు
మూడును పరిశుద్ధి బొంద
చల చల్లని పన్నీటను
జలకము లాడంగ రారె ...10

వస్త్రం :
అలుగంగా వలదయ్యా
నెలపొడుపుకు నూలుపోగు
వలె ఇదిగో ఈ నూతన
వల్కముల నర్పించెద ...11

ఉపవీతం :
లూతా తంతుల బోలు
నూతన యజ్ఞోపవీత
మాంగల్య సూత్రములను
మనసారగ అర్పించెద ...12

గంధం :
ఎసగెడి సౌరభములతో
దెసల గుబాళింప చేయు
హరి చందన చర్చలను
ఇరువురకూ అర్పించెద ...13

కుంకుమ :
ఏపగు నును కాంతులతో
చూపుల పండుగలు చేయు
కుంకుమతో అక్షతలతొ
పొంకపు తిలకమ్ము లిడుదు ...14

ఆభరణం :
ఐశ్వర్యపు పరసీమల
శాశ్వతతముగ కొలువు దీరు
మీకిడు ఈ చిరుసొమ్ములు
గైకోరే కరుణమీర ...15

పుష్పం :
ఒయ్యారపు రేకులతో
ఒప్పగు వాసనలతోడ
సిరి మించే పలు రకముల
విరిదండల నర్పించెద ...16

ధూపం :
ఓదేవీ! ఓ దేవా!
ఓంకృతి సంవేద్యులార
ఈ సురభిళ1 ధూపమ్ముల
మీ సేవకు అర్పించెద ...17

దీపం :
ఔదార్యపు దీపు ్తలతో
అందర వెలిగించుచుండు
మీకిదిగో అర్పించెద
చేకొనరే దీపమ్ముల ...18

నైవేద్యం :
అందరనూ పోషించెడి
ఆద్యులకానందమొప్ప
సుమధుర నైవేద్యంబుల
సమకూర్చెద భక్తితోడ ...19

తాంబూలం :
అహమహమని పై కొనుచూ
అహ ముడిగిన మునిజనులే
దరిచేరే మీ కిదిగో
తాంబూలం బర్పించెద ...20

హారతి :
కర్పూర ఖండముల
కమనీయ జ్వాలలతో
ఆరని లో వెల్గులతో
హారతు లెత్తెదను మీకు ...21

మంత్ర పుష్పం :
చతురానన ముఖనిస్సృత
చతుర్వేద వినుతులార!
ఇదే మంత్ర పుష్పాంజలి
నిడు చుంటిని కైకొనరే ...22

ప్రదక్షిణం :
టక్కరినై చెడు నడతల
చిక్కిన నా చెడుగు తొలగ
చేకొని ప్రదక్షిణమ్ము
మీకిదె గావింతు నిపుడు ...23

పునఃపూజ :
తత్వార్థ స్ఫురణకునై
సత్వావిష్కరణ కొరకు
పూనికతో పునః పునః
పూజల నర్పింతు మీకు ...24

క్షమాప్రార్థన :
పనిగొని నే పాపమ్ముల
పలుమరు గావించు చుంటి
దేవా ! మీ సత్కరుణా
సేవధియే నాకు రక్ష ...25

అర్పణ :
యతివర సుర సంసేవ్యా
యమనియమోపాస్య తత్త్వ
పరమేశా నా చేసెడు
ప్రతిపనియూ నీ కర్పణ ...26

ప్రార్థన :
శత వాంఛా జ్వాలలలో
శలభములై మాడు మమ్ము
శ్రీ కరుణామృత ధామా
చేకొని నైష్కామ్య మీవె ...27

ఫల సమర్పణ :
క్షర మక్షర మను రెంటికి
పరసీమలవెల్గుచుండు
అద్వైతాత్మకులారా
సద్విద్యా రూపులార!
సోహమ్మను భావనచే
నూహాగతి నీ మానస
పూజావిధి మీ పాదాం
భోరుహముల నర్పించితి
అవ్యాజప్రేమాత్మకు
లగు మీకిది తృప్తి గూర్చి
అందించుత శ్రీ సచ్చిదా
నందామృత సిద్ధిమాకు ...28

Sri Datta Anagha Lakshmi Vratam Manasa Pooja by Sri Ganapathy Sachchidananda Swamiji

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Tvamasmin Karya Niryoge - Hanuman Mantra parayana-108 times by Sri Ganapathy Sachchidananda Swamiji

Tvamasmin Karya Niryoge - Hanuman Mantra parayana-108 times by Sri Ganapathy Sachchidananda Swamiji

15 minutes anaghastami vratham  for koti anaghastami vratham

15 minutes anaghastami vratham for koti anaghastami vratham

23 November 2025 భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి శత జన్మదిన వేడుకలో భాగంగా మహానగర సంకీర్తన.

23 November 2025 భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి శత జన్మదిన వేడుకలో భాగంగా మహానగర సంకీర్తన.

ఎటువంటి కష్టాన్నైనా  తేలికగా పరిష్కరించే దత్త ప్రదక్షిణ ఇంట్లోనే ఇలా చేసుకుంటే | Srilaxmi | RedTV

ఎటువంటి కష్టాన్నైనా తేలికగా పరిష్కరించే దత్త ప్రదక్షిణ ఇంట్లోనే ఇలా చేసుకుంటే | Srilaxmi | RedTV

చాగంటి ప్రవచనానికి లోకేష్ తో సహా, లేచి నిలబడి చప్పట్లు..! Chaganti Koteshwara Rao Pravachanam | Dial

చాగంటి ప్రవచనానికి లోకేష్ తో సహా, లేచి నిలబడి చప్పట్లు..! Chaganti Koteshwara Rao Pravachanam | Dial

అనఘావ్రత మానస పూజ

అనఘావ్రత మానస పూజ

Sri Datta Anagha Lakshmi Vratam Audio 3 repetitions by Sri Ganapathy Sachchidananda Swamiji

Sri Datta Anagha Lakshmi Vratam Audio 3 repetitions by Sri Ganapathy Sachchidananda Swamiji

Lalitha Trishati stotra by HH Sri BalaSwamiji

Lalitha Trishati stotra by HH Sri BalaSwamiji

శ్రీ సాయిబాబా ఆశీస్సులు పొందే భక్తి పాటలు | Om Sai Ram | Sai Baba Devotional Songs In Telugu

శ్రీ సాయిబాబా ఆశీస్సులు పొందే భక్తి పాటలు | Om Sai Ram | Sai Baba Devotional Songs In Telugu

Shatashloki  Ramayana Rendered By H.H Sri Ganapathy Sachchidananda Swamiji, with Telugu Script

Shatashloki Ramayana Rendered By H.H Sri Ganapathy Sachchidananda Swamiji, with Telugu Script

Kavacha Manjari album in one video rendered by His Holiness Sri Ganapathy Sachchidananda Swamiji.

Kavacha Manjari album in one video rendered by His Holiness Sri Ganapathy Sachchidananda Swamiji.

మనసులో ఏ కోరిక అయినా 18 రోజుల్లో నెరవేర్చగల అనఘాదత్త రహస్యమైన పూజ | Nanaji Patnayak | RedTV Bhakthi

మనసులో ఏ కోరిక అయినా 18 రోజుల్లో నెరవేర్చగల అనఘాదత్త రహస్యమైన పూజ | Nanaji Patnayak | RedTV Bhakthi

Sri Datta Raksha Mantra for Parayana - 300 times by Sri Ganapathy Sachchidananda Swamiji

Sri Datta Raksha Mantra for Parayana - 300 times by Sri Ganapathy Sachchidananda Swamiji

Sri Anaghastami Vratham Manasa Puja🌹_Sri Swamiji

Sri Anaghastami Vratham Manasa Puja🌹_Sri Swamiji

శివుని భక్తి పాటలు | Lord Shiva Songs Telugu | Shiva Songs | Lingashtakam | Monday Special Songs

శివుని భక్తి పాటలు | Lord Shiva Songs Telugu | Shiva Songs | Lingashtakam | Monday Special Songs

రేపే అనఘాష్టమి : ఈ ఒక్క వ్రతం చేస్తే చాలు కోరిన కోరికలు నేరవేరుతాయి || Anghastami Vratham || SS

రేపే అనఘాష్టమి : ఈ ఒక్క వ్రతం చేస్తే చాలు కోరిన కోరికలు నేరవేరుతాయి || Anghastami Vratham || SS

Sri Guru Gita

Sri Guru Gita

Om Namo Hanumate Namaha - Hanuman Mantra Parayana-108 times  by Sri Ganapathy Sachchidananda Swamiji

Om Namo Hanumate Namaha - Hanuman Mantra Parayana-108 times by Sri Ganapathy Sachchidananda Swamiji

Manidweepa Varnana |మణిద్వీప వర్ణన తెలుగు|Manidweepa Varnana by Srivani Gorantla Bhakti Chanel-SGBC

Manidweepa Varnana |మణిద్వీప వర్ణన తెలుగు|Manidweepa Varnana by Srivani Gorantla Bhakti Chanel-SGBC

లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి..? | Sri Ganapathy Sachchidananda Swamiji | Bhakthi TV

లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి..? | Sri Ganapathy Sachchidananda Swamiji | Bhakthi TV

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]