నరసన్నని దర్శించుకోవాలని 20 ఏళ్ళ నా కళ.. తన మొక్కుని నెరవేరుస్తున్న మాతృదేవోభవ గట్టు గిరి.
Автор: Matrudevobhava Anadha Ashramam (9347513830)
Загружено: 25 дек. 2024 г.
Просмотров: 327 323 просмотра
సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 సం.లుగా జుట్టు పెంచుకుని మాసిన, చిరిగిన బట్టలతో నిస్సహాయ స్థితిలో తిరుగుతున్న వ్యక్తిని గురించి స్థానికులు సమాచారం అందించడంతో నేను నా ఆశ్రమ బృందంతో అక్కడికి వెళ్లి చూడగా అతను కనిపించలేదు. చాలాసేపు అతని గురించి మేము అందరం వెతికాము. అరగంట వెతికిన తర్వాత ఆ వ్యక్తి కనిపించాడు. అతడిని చూడగానే నా గుండె ఎంతో బరువెక్కింది. ఇన్నిరోజులు అతను ఇంత దుర్భరమైన స్థితిలో ఎలా బ్రతికాడో తలుచుకుంటే కన్నీళ్లు వచ్చాయి. అతడిని ఆశ్రమానికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంటే చుట్టుప్రక్కల ప్రజలు కొందరు నిరాకరించారు. అయినా కూడా అతని పరిస్థితి చూసి అతనికి పునర్జన్మ కల్పించి మామూలు మనిషిలా మార్చాలని సంకల్పంతో వారిని ఒప్పించి పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించి వారి సహకారంతో అతడిని ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది.
20 సం.లుగా యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహాస్వామి సన్నిధిలో తలనీలాలు సమర్పించాలని పెంటయ్య ఆకాంక్ష. కానీ అతని మానసిక స్థితి వల్ల యాదగిరిగుట్ట వెళ్లలేకపోయాడు. ఇప్పుడు పెంటయ్యను మన ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. అందువల్ల మన పెంటయ్యను మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహాస్వామి సన్నిధిలో తలనీలాలు సమర్పించి, అక్కడే పునర్జన్మ కల్పించాలని నిర్ణయించుకున్నాము. కావున మన పెంటయ్య కోరిక మేరకు దయచేసి ప్రతి ఒక్కరు యాదగిరిగుట్ట దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులకు చేరే వరకు ఈ వీడియో షేర్ చేసి అతనికి యాదగిరిగుట్టలో పునర్జన్మ కల్పించడానికి అనుమతి ఇచ్చేలా మీ వంతు తోడ్పాటును అందిస్తారని కోరుకుంటూ...
మీ గట్టు గిరి
#yadagirigutta #yadadri #lakshminarsimhaswamy #haircut #emotional #tag #yadadritemple #temple #share #viral #viralreels #viralpost #humanity #help #support
@hamara__yadadri @yadagiriguttatemple @yadadri_lakshminarasimha_swami @yadadri_temple_yadagirigutta

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: