నువ్వేకావాలి సినిమా లొకేషన్ /Kurusura S20 Submarine/ Visakhapatnam/ Nuvvekavali
Автор: telugu nature power
Загружено: 2025-03-02
Просмотров: 5898
ఐ.ఎన్.ఎస్.కుర్సురా (ఎస్.20) అనేది ఇండియన్ భారత నావికా దళానికి చెందిన కల్వరి తరగతి (ఫాక్స్‌ట్రాట్-తరగతి రూపాంతరం) ఇంధన-విద్యుత్ జలాంతర్గామి.అది భారతదేశానికి చెందిన నాల్గవ జలాంతర్గామి.కుర్సురా 1969 డిసెంబరు 18న వాడుకలోకి ప్రారంభించబడి, 31 సంవత్సరాల సేవచేసిన తర్వాత 2001 ఫిబ్రవరి 27న ఉపసంహరించబడింది.అది 1971 ఇండో-పాకిస్తానీ యుద్ధంలో పాల్గొంది. అక్కడ అది పెట్రోల్ మిషన్లలో కీలక పాత్ర పోషించింది. తరువాత కుర్సురా ఇతర దేశాలతో నావికా విన్యాసాలలో పాల్గొంది. ఇతర దేశాలలో అనేక సద్భావన పర్యటనలు చేసింది.
కుర్సురా దాని సేవ నుండి ఉపసంహరించుకున్న తర్వాత, దీనిని 2002న ఆగష్టు 9న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేసాడు.2002 ఆగష్టు 24 నుండి ప్రజల ప్రవేశం కొరకు మ్యూజియంగా భద్రపరచబడింది.ఇది చివరిగా విశాఖపట్నం రామకృష్ణ బీచ్ వద్దకు ప్రయాణించి, అక్కడ తన స్థిర నివాసం ఏర్పరచుకుంది. కుర్సురా వాస్తవికతను నిలుపుకున్న అతి కొద్ది జలాంతర్గామి మ్యూజియాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. విశాఖనగరంలో "తప్పక సందర్శించవలసిన పర్యాటక గమ్యస్థానం"గా గణితికెక్కింది. కుర్సురా ఉపసంహరించబడిన జలాంతర్గామి అయినప్పటికీ, ఇది ఇప్పటికి నౌకాదళం "డ్రెస్సింగ్ షిప్" గౌరవాన్ని అందుకుంటుంది. ఈ గౌరవం సాధారణంగా క్రియాశీల నౌకలకు మాత్రమే ఇవ్వబడుతుంది.
#submarine #visakhapatnam #rkbeachvizag
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: