||యేమేమౌనో ఏమెరుకా ఎటు పోతుందో ఈ నౌక ( By) ||రామచంద్ర మాస్టర్ (తబలా) శంకర్ సింగ్||
Автор: Shiva Sankeerthana
Загружено: 2025-07-28
Просмотров: 5448
ఏమేమౌనో ఏమెరుకా ఎటుబోతుందో యీ నౌకా ! గమనము జేసే యీనౌకా ! గమ్యము ఏదో ఏమెరుకా క్షేమముగోరే చెలి లేకా ఏమౌనో జీవన నౌక (ఏ)!
కావాలన్నది జరిగేనా ? కావలదన్నది ఆగేనా ? ఏ విధి బాధలు ఎదురైనా ? జీవన పయనంబాగేనా ?(ఏ)!
యితరులజూచీ నేర్చేము అతుకులబ్రతుకును గడిపేము మితసౌఖ్యముకే మురిసేము వ్యతలెదురైతే వగచేము. (ఏ)!
ధనదాన్యంబులు దాచేము మనకని మదిలో మురిసేము తనుమన ధనములు శాశ్వతమా ? అని విడనాడుట జీవితమా (ఏ)!
మనవారని మది తలచేము మనసున మమతలు పెంచేము మమతలుపంచిన మనిషేది ? మనసుననిండిన మమతేది (ఏ)!
కలతల బ్రతుకులు కన్నీరు - కరుగని హృదయము కనలేదు కలతలు దీర్చుట నీవశమా కరుణలేనిదొక జీవితమా. (ఏ)!
తెలిసే కలిగిన యీబాధా తెలియని నాడు లేదుగదా తెలిసీ తెలియక యీబాధా తెలిసిన పిమ్మట లేదుగదా (ఏ)!
ఊహలకందని వాడొకడు ఉన్నాడా జగదీశ్వరుడు ఊహలు చెదిరిన రాముండు ఆహా శివలీలన్నాడు. (ఏ)!
(১)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: