Parishuddi Parishuddi | New Telugu Chiristian Song | Latest Telugu Christian Songs
Автор: True Way Gospel Songs
Загружено: 2025-04-07
Просмотров: 844
Parishuddi Parishuddi | New Telugu Chiristian Song | Latest Telugu Christian Songs
Credits:
Lyricist & Composition: Shri. Purushottama Chowdary
Vocalist: Anwesshaa Dutta
Music Direction: Jonah Samuel
పరలోక రాజ్య మహిమను తెలిపే అద్భుత ఆంధ్ర క్రైస్తవ గీతం.
పాట సంఖ్య 504.
పదకోశం
పరమేశ్వరుడు = సర్వశక్తిగల దేవుడు
చిరము = ఎల్లప్పుడూ ఉండేది
భాసురము = కాంతివంతమైనది
రవి = సూర్యుడు
కుముదబాంధవుడు = కమలపువ్వుకు బంధువు (చంద్రుడు)
దీపచ్ఛవి = దీపం నుండి వచ్చే వెలుతురు
అవిరతమున = నిరంతరం
ప్రభ = వెలుగు
సంస్తవ = స్తుతించే
వైభవం = గొప్పతనం, కీర్తి
ఉత్సవం= వేడుక, పండుగ
గొద = ఆకలి
దగ = మోసము
జీవ ఉదకము = జీవ జలము
నర్మిలి = ప్రేమ
సంసారం = పుట్టుక, మరణం, మరియు దుఃఖం అనే చక్రం నుండి విముక్తి పొందలేకపోవడం
Lyrics:
పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని
వినబడు పుర మదిగో పద పదరే ప్రియులారా
పరమేశ్వరుని చేత బరిపాలనము గల్గి
చిరమై భాసురమై సుస్థిరమై సుందరమైన ||పరిశుద్ధి||
రవితోను కుముదబాం ధవుతోను మఱి దీప
చ్ఛవితోను దాని కవసర మింతలేదు
అవిరతమున గ్రీస్తుడందుండు ప్రభతో
సంస్తవమై వైభవమై యుత్సవమై వెల్గుచు నుండుఁ ||పరిశుద్ధి||
గొదయైన మఱియే యా పదయైన దగయైన
మొదలేలేకుండు నప్పుర వాసులందు
మృదు జీవోదకము లర్మిలి నిరంతర మిచ్చు
గుదురుగ నెదురుగ గూర్చుండి యువరాజు ||పరిశుద్ధి||
జననంబు మరణంబు సంసార సుఖ బాధలను
భవించుట గల్గ దా పురమునందు
మును నీతికొఱ కాపదను బొందు తనవారి
కనునీళ్లన్నియుదుడుచు మన దేవుడందుండి ||పరిశుద్ధి||
భావం
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వినపడుతూ ఉండే పట్టణము. సర్వశక్తి మంతుడైన దేవుడు ఎల్లప్పుడూ పరిపాలించే అందమైన, స్థిరమైన పురము అది.
సూర్యుడు, చంద్రుడు, దీపం నుండి వచ్చే ఏ కాంతితోనూ అవసరం లేని గొప్ప పట్టణములో దేవుడే వెలుగుగా ఉంటాడు. ఆ పట్టణంలోని క్రీస్తు నిరంతరం గొప్పగా స్తుతించబడుతూ, కీర్తించబడుతూ వెలుగుతూ ఉంటాడు.
ఆకలి లేని మరి ఏ విధమైన ఆపద, మోసము లేని ఆ పురములో, కుదురుగా ఎదురుగా కూర్చున్న ఆ యువరాజు జీవ జలాలను ప్రేమతో నిరంతరం అందిస్తూ ఉంటాడు.
పుట్టుక, మరణము అనే సుఖ బాధల అనుభవం లేని ఆ పట్టణం, నీతి కొరకు ఆపదలు పొందే తన వారి కన్నీళ్లను తుడిచే ఆ దేవుడుండే ఉండే లోకం.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: