Devuni premaye manalanu | Song of Zion Telugu | song from special meeting 15aug2025.
Автор: Bro Subudhi GS Official
Загружено: 2025-08-16
Просмотров: 1814
#Zionsong #placeofworship
song lyrics:
పల్లవి: దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్ తన మహా ప్రేమచేత - క్రీస్తుతో కూడా బ్రతికించెన్. అ.ప: ఆ ప్రేమ మారనిది - శాశ్వతమైనది మమ్ము ఏడబాయనిది - వాడబారనిది
1. దోషులమైన మనలను నిర్దోషులుగా చేయ జగత్తు పునాదికి ముందే మనల రక్షించనేంచే తన స్వాస్థ్యముగా నుండుటకై - ముందుగా ఏర్పరచెన్. ||ఆ ప్రేమ||
2. దాసులమైన మనలను - ధనవంతులుచేయ దాసునిగా ఈ జగతిలో జన్మించుట ద్వారా తన ప్రజలనుగా స్వీకరించి - మహిమకై ఏర్పరచెన్. ||ఆ ప్రేమ||
3. నిర్జీవులమైన మనలను - జీవింపజేయుటకు జీవధిపతినే బలిగా - అర్పించుట ద్వారా తన రక్తముతో మనలను కడిగి - సాక్షులుగా ఏర్పరచెన్. || ఆ ప్రేమ||
4. అవిధేయులమైన మనలను - విధేయులుగా చేయా సిలువ మరణము వరకు - విధేయత చూపెన్ మనలను పరమున చేర్చుటకు - మార్గము ఏర్పరచెన్. ||ఆ ప్రేమ||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: