Asta Laxmi nee avatharam song.Melodious song of Laxmi devi in Telugu.Full song.Laxmi devi songs.
Автор: Rishi's Science tricks
Загружено: 2021-02-15
Просмотров: 889196
Asta Laxmi nee Avatharam song.The melodious song of Laxmi Devi in Telugu.Full song.Laxmi Devi songs.
Telugu Lyrics:
అష్టలక్ష్మీనీ అవతారం
ఆశ్రిత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపు కుంకుమ నీ రూపం "2"
అక్షయ సిద్ధికి ప్రతిరూపం
రక్షింపవే మము అను నిత్యం
చంద్రుని చెల్లివి శ్రీ లక్ష్మీ
వెన్నెల నవ్వుల వరలక్ష్మీ
చెంచలమౌ నీ కన్నులవే
చైతన్యానికి వన్నెలవే
అమృతమైనది నీ హృదయం
అంబరీశ ఎద నీ నిలయం "అష్టలక్ష్మీ"
ఆకాశమంటును నీ తేజం
నిను అర్చించుట సౌభాగ్యం
ఓంకారం నీ తొలి మంత్రం
శుభములనొసగును శ్రీ యంత్రం
శిష్ఠ విశిష్ఠుల సేవలవే
ఇష్టము నీకవి ఇంద్రాణి
నిష్ఠతో కొలిచిన నినుచాలు
కష్టము తొలగును అలిమేలు "అష్టలక్ష్మీ"
సృష్టికి మూలం నీవుకదే
దృష్టిని మా పై చూపు సదా
అష్టలక్ష్మీవై రావమ్మా
విష్ణువు ప్రియసఖి నీవమ్మా
కుబేర మంత్రపు కలశముతో
కుచేల బాధలు తొలగునులే
కరుణను చిలికే కన్నులతో
శరణము నీయవే శాంతి ప్రియే "అష్టలక్ష్మీ"
సిరిసంపదలకు సన్నిధివే
ధరణిని కాచే పెన్నిధివే
శ్రీ అక్షరమున స్థిరముగాను
మోక్షమునీయవే మహాలక్ష్మీ
భక్తి కొలనులో పద్మసఖి
పద్మ సుహాసిని ప్రణవముఖి
పద్మనాభునికి ప్రియసఖివే
పద్మాసిని స్రిత పాలినివే "అష్టలక్ష్మీ"
దేవతసురగన పూజితవే
దివ్యాంబరధర మాలికవే
ధర్మ పీఠమున దక్షతతో
ధర పాలింపవే ధనలక్ష్మీ
ఇంద్రాది గణము సేవింప
ఇరవుగ కొలువగు హిరణ్మయి
రాజ్యలక్ష్మివై పాలించే
రమణీ లాలామి రాగమయి "అష్టలక్ష్మీ"
పూపొప్పొడిలో పరిమళవే
పొలతి నీవే నవకళవే
చేమంతులలో హేలవులే
హేమంతానికి రాణివిలే
తరకమలమ్ముల కల్హారం
గిరికనుమలలో సింధూరం
కామితదాయిని కమలాక్షి
నీరజ నిర్మల నిగమాంగి || అష్టలక్ష్మి ||
డూలాసురులను వధియించి
శూలాయుధ ధరి శ్రీలక్ష్మి
హాలాహలమును ఛేదించే
లీలామానుష రూపిణివే
జ్యేష్ఠ నక్షత్ర ప్రియసఖివే
సృష్టికి మూలాధారిణివే
స్పష్టము మాకిది నీదరిలో
నష్టము కలుగదు గమనములో || అష్టలక్ష్మి ||
ఋగుముని పుత్రిక నీవమ్మా
భువనము నేలగ రావమ్మా
నగవులు చిలికెడి నగమల్లి
నిగమ రూపిణివి మా తల్లి
శంఖు చక్రములు కరములలో
శాంతి భావనలు ఎదసడిలో
శశాంక వన్నెల వదనములో
ప్రభాత వెలుగులు కన్నులలో || అష్టలక్ష్మి ||
నీరజ నినుమది నిలిపినచో
నిత్య శుభమ్ములు నీ దరిలో
మడిలో మన్యము నింపుటకై
ధాన్యలక్ష్మి వై దయగొనుమా
విద్యలన్నిటికి నాయికవై
విశ్వములేలవ దేవతవై
వీణాపాణివి నీవుగదే
విద్యాలక్ష్మిగ కావగదే || అష్టలక్ష్మి ||
బాలలలో పసిపాపవులే
పాలకడలి ఒడి బాలికవే
సంతోషాలను కలిగించే
సంతాన లక్ష్మివి నీవెగదే
హంస గమనమే నీదమ్మా
హింసను అణచగ రావమ్మా
సింహవాహిని నాఎదలో
స్థిరముగ కొలువై ఉండమ్మా || అష్టలక్ష్మి ||
కరమున ఖడ్గపు మిలమిలతో
వీరలక్ష్మివే విరిబోణీ
ఘుమ ఘుమ పరిమళ సొగసులతో
ఢమరుక ధరునికి సోదరునివే
ఐరావతమ్ములు సేవించే
ఐశ్వర్యానికి దేవతవే
సకల సంపదల సంభరితం
సౌభాగ్యలక్ష్మీ నీసదనం || అష్టలక్ష్మి ||
వేద నాదముల ఘోషలతో
విజయలక్ష్మి నిను కొలిచెదము
సామవేదముల సరిగమలో
జ్ఞాననిధులు అందింపుమికా
ఐహిక జీవన గమనములో
ధైర్యలక్ష్మివై ధరిణిలుమా
హిరణ్యమయివై రావమ్మా
మాహృదయాలివి నీవమ్మా || అష్టలక్ష్మి ||
హరిణలోచనీ నీరూపం
హరిహృదయానికి ఆభరణం
చరా చరమ్ముల చైతన్యం
హిరణ్మయీ నీ కర చరణం
అఖిల జగతికొక అమ్మవలె
ఆదిలక్ష్మి నిను కొలిచెదమూ
అండ పిండముల బ్రహ్మాండాలకు
ఆధారానివే నీవమ్మా || అష్టలక్ష్మి ||
పన్నగ శయునికి ప్రియసఖివై
విన్నప మిదివిను విమలధరి
ఎన్నగభువిలో నీకన్నా
మిన్నగు దైవం లేదుకదా
కామధేనువే నీవెంటా
కల్పతరువు నీ వర పంటా
అర్చించే నీ భక్తులకూ
అదృష్ట లక్ష్మివి శ్రీదేవీ || అష్టలక్ష్మి ||
కోటిప్రభాకర వెలుగులలో
సాటిరారు నీకెవరమ్మా
వైకుంఠానికి నాయికవే
వైభవ లక్ష్మీ మా జననీ
వేయికన్నులవి చాలవులే
విశ్వమాత నిను చూడంగా
మాయామోహము తొలగును గా
మాతా నిను మది తలువంగా || అష్టలక్ష్మి ||
మంత్ర స్వరూపిణి మహాలక్ష్మీ
శాంతి సుఖమ్ముల నీవమ్మా
యాంత్రికమౌ మా గమనంలో
మంత్రము కావే మహదేవీ
చిన్మయ రూపపు కాంతిగని
తన్మయమొందెద శ్రీమాతా
కర్మ బంధములు తొలగించే
కమ్మని అభయము నీ కరము || అష్టలక్ష్మి ||
సకల దేవతా రూపిణివై
సుఖ పిక రవముల సన్నిధిలో
మణిమయ కాంతుల మకుటముతో
మహిమలు చూపవే మహాలక్ష్మీ
సురగణ సన్నుత లాలనలో
వరములునొసగును మహాలక్ష్మీ
జనగణమనముల జయనాదం
గణ గణ అందెల నీపాదం || అష్టలక్ష్మి ||
మేఘాతటిల్లత మాలికవే
రాగ సుధామయ ప్రకృతివే
ప్రీతి పుష్కరిణి నీవమ్మా
ధాత్రి రక్షణకు రావమ్మా
పడతికి నుదుటను కుంకుమగా
ప్రకాశింపవే ప్రతినిత్యం
మంగళ రూపిణి మాతల్లీ
ఇందుశీతలీ హిమవల్హీ || అష్టలక్ష్మి ||
కరుణను చిలికే కన్నులలో
కమలము విరిసెను కాంతిమయీ
శరణము కోరెద నిన్నెపుడూ
తరుణము నీ పద సేవనకై
ఎద కర్పూరము చేసితినీ
జేగంటను మ్రోగించితినీ
పద సన్నిధినీ చేరితినీ
నిను నా మదిలో నిలిపితినీ || అష్టలక్ష్మి ||
మంగళమమ్మా మా జననీ
మము దయగనుమా మహలక్ష్మీ
సంపదలొసగే శ్రీకరణీ
హారతి నీకిది హరిపత్నీ
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రిత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం || అష్టలక్ష్మి ||
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
This is the most requested video please like this video and gives 1000 likes and please subscribe to my channel and make me get 1000 subscribers I will upload many songs like this
Thank you
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: