అలనాటి స్వర మధురిమలు.4 నమో హిందు మాత దేశ భక్తి గీతం గానం పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు
Автор: tenali kala sravanti
Загружено: 2021-10-23
Просмотров: 558
అలనాటి స్వర మధురిమలు శీర్షికలో భాగంగా 4 పాట నమో హిందు మాత దేశభక్తి గీతం పాడినవారు పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు వీరు తెలుగు నాటకరంగంలో మూడు దశాబ్దాల పాటు వైవిధ్యభరితమైన స్త్రీ పాత్రలను ధరించి ప్రేక్షకులను అలరించారు శ్రీ స్థానం 1902 లో గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు తన 19వ ఏట తొలిసారిగా ఆడవేషం వేశారు తరువాత ఆంధ్ర ప్రదేశ్ తెనాలి పట్టణం చేరి జీవితాంతం వరకు అక్కడే గడిపారు వీరు శ్రీకృష్ణ తులాభారం లో సత్యభామ గా పేరు సంపాదించారు మీరజాలగలడా నాయానతి అనే పాటను తానే స్వయంగా రచించి గానం చేశారు నాడు నాటకాలలోచిత్రాంగి మధురవాణి శకుంతల దేవదేవి ముర. సుభద్ర చండిక. సైరంద్రి లాంటి స్త్రీ పాత్రలు ధరించారు శ్రీ స్థానం ఎన్నో ప్రైవేటు రికార్డులకు తన గళాన్ని అందించి ప్రజల మన్ననలను పొందారు 1967 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ బిరుదును పొందారు నాడు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం లో నాటక ప్రయోక్తగా పని చేశారు సత్యభామ పాత్ర శ్రీ స్థానం వేల నాటకాలు ప్రదర్శించి తెనాలికి పేరు తెచ్చిన గొప్ప నటులు శ్రీ స్థానం నరసింహారావు గారు 21.2.1972న తెనాలిలోనే ఈ లోకం అనే రంగస్థలం నుండి నిష్క్రమించారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: