ద్వితియోపదేశకాండము 4 వ అధ్యాయము. AUDIO BIBLE QUIZE
Автор: Fragrance_official
Загружено: 2024-12-04
Просмотров: 11
💕 Latharaj: ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం ప్రశ్నలు జవాబులు
1.మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో _______
Ans:దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు..
ద్వితియోపదేశకాండము 4:2
2. బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా ఏమి చేసెను.
Ans:నీ మధ్యను ఉండకుండ నాశనము
ద్వితియోపదేశకాండము 4:3
3.మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరును నేటివరకు ఎలా యున్నారు.
Ans:సజీవులై
ద్వితియోపదేశకాండము 4:4
4.ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుస రింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు _______.
Ans :అదే మీకు జ్ఞానము, వివేకము.
5.వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము _______ జనమని చెప్పుకొందురు.
Ans: జ్ఞాన వివేచనలు గల
ద్వితియోపదేశకాండము 4:6
7.ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టు నప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు ________నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు నున్నాడు?
Ans: సమీపముగా
ద్వితియోపదేశకాండము 4:7
8.నీవు ఎక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి యుండగా యెహోవానా యొద్దకు ప్రజలను కూర్చుము; వారు ఆ దేశముమీద బ్రదుకు దినములన్నియు నాకు భయపడ నేర్చుకొని, తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమునుగూర్చి వారికి తెలుపుము.
Ans:హోరేబులో
ద్వితియోపదేశకాండము 4:10
[21/09, 12:45 pm] Latharaj: 9. యెహోవా మీతో ఎక్కడ నుండి మాటలాడెను.
Ans: ఆ అగ్ని మధ్యనుండి
10. మాటలధ్వని మీరు వింటిరిగాని ,స్వరము మాత్రమే వింటిరి. ఏమి మీరు చూడలేదు.
Ans: యే స్వరూపమును
11.మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను, ఎక్కడవ్రాసెను.
Ans: పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసెను.
ద్వితియోపదేశకాండము 4:13
12.హోరేబులో యెహోవా ఎక్కడనుండి మీతో మాట్లాడాను. మీరు ఏ స్వరూప మును చూడలేదు.
Ans : అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాటలాడెను .
ద్వితియోపదేశకాండము 4:15
13.యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు____ నుండు టకై, ఐగుప్తుదేశములో నుండి ఆ యినుపకొలిమిలోనుండి మిమ్మును రప్పించెను.
Ans: స్వకీయ జనముగా
ద్వితియోపదేశకాండము 4:20
14.ఏలయనగా నీ దేవుడైన యెహోవా ఏటువంటి దేవుడు.
Ans:దహించు అగ్నియు రోషముగల దేవుడునై యున్నాడు.
ద్వితియోపదేశకాండము 4:24
15.మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచు కొనబోవు దేశములో ఉండకుండ త్వర లోనే బొత్తిగా నశించిపోదురని _______ మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను.
Ans:భూమ్యాకాశములను
ద్వితియోపదేశకాండము 4:26
16.అక్కడ మీరు మనుష్యుల చేతి పనియైన _______ అవి ____.
Ans:కఱ్ఱ రాతిదేవతలను పూజిం చెదరు.
చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.
ద్వితియోపదేశకాండము 4:28
17. అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు ఎలా వెదకిన యెడల, ఆయన నీకు ప్రత్యక్షమగును.
Ans: నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మ తోను వెదకు నప్పుడు
ద్వితియోపదేశకాండము 4:29
18.నీ దేవుడైన యెహోవా ______గల దేవుడు.
Ans: కనికరముగల
19..నీ దేవుడైన యెహోవా కనికరముగల గల దేవుడు. కనుక నేను ఏమి చేయడు.
Ans: గనుక నిన్ను
చెయ్యి విడువడు;
నిన్ను నాశనముచేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.
ద్వితియోపదేశకాండము 4:31
20. చంపినవాడు పారిపో వుటకు మోషే_____ దిక్కున, యొర్దాను ఇవతల ____ వేరుపరచెను.
Ans:తూర్పుదిక్కున
మూడు పురములను.
ద్వితియోపదేశకాండము 4:42
21. మూడు పురములు ఎక్కడ ఎక్కడ ఉన్నవి.
Ans:అవేవనగా రూబే నీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును,
గాదీ యులకు గిలాదులో నున్న రామోతును,
మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.
ద్వితియోపదేశకాండము 4:43
22.మోషే ఎక్కడ ఇశ్రాయేలీయులకు శాసనములు కట్టడలు న్యాయ విధులు నియ మించెను.
Ans:యొర్దాను ఇవతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీ యుల రాజైన సీహోనుదేశమందు
ద్వితియోపదేశకాండము 4:46
23. భాషను రాజైన ఓగుదేశం ఏ దిక్కున ఉన్నది.
Ans: యోర్ధాను ఇవతల ఉదయ దిక్కున నున్నది.
24.మోషేయు ఇశ్రాయేలీయులును ఐగుప్తులోనుండి వచ్చుచు స్వాధీనపరుచుకొనిన దేశములు ఏమిటి?
Ans: ఆ సీహోనును హతము చేసి అతని దేశమును, యొర్దాను ఇవతల ఉదయదిక్కున నున్న బాషాను రాజైన ఓగుయొక్క దేశమును,
అర్నోను ఏటి దరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సీయోను కొండవరకున్న అమో రీయుల యిద్దరు రాజులదేశమును,
పిస్గా యూటలకు దిగువగా అరాబా సముద్రమువరకు తూర్పుదిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతయు స్వాధీన పరచు కొనిరి.
ద్వితియోపదేశకాండము 4:48,49
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: