Garudadri to Pamuleti | Kasinayana Jyothi | Nallamala
Автор: Sahasa Yatrikudu
Загружено: 2024-02-02
Просмотров: 3576
కడప జిల్లాలో ఉన్న #కాశినాయనజ్యోతి క్షేత్రం నుండి #గరుడాద్రి మీదుగా పాములేటిని చేరి అక్కడనుండి ఎగువ అహోబిలం చేరుకునే మా ఈ ప్రయాణం. #నల్లమల అడవుల్లో చెంచులు ఉంటారని మన అందరికీ తెలిసిన విషయమే అయితే వారితో పాటు #పుట్టుపాపలు ఉన్నట్లు పెద్దగా ఎవరికి తెలియదు. ఈ విషయం మనకి
#మెకంజి #కైఫీయత్ వలన కొంతవరకు తెలియ వస్తుంది. 1780 ప్రాంతంలో అహోబిలం దగ్గరలో ఉన్న #ముత్యాలపాడు సంస్థానం పాలనాధిపతి ఈ పుట్టుపాపల గురించి విని కొంతమంది చెంచులను నియమించి పుట్టుపాపలను పట్టుకు రమ్మని ఆదేశించారు. ఆ చెంచులు ఇద్దరు పుట్టుపాపలను పట్టుకొని తీసుకువస్తుండగా దారిలో ఒకరు మరణించారు మరొకరికి మన భాష తెలియటం లేదు అతనిని తిరిగి మళ్ళీ అడవిలో వదిలి వేశారు. ఈ విషయం ముత్యాలపాడు సంస్థానం రికార్డులలో నమోదయి ఉంది. ఈ పుట్టుపాపలు #చెంచులు కంటే భిన్నంగా ఎటువంటి వస్త్రాలు ధరించకుండా జంతువులను వేటాడి పశ్చిమాంసమే తినేవారు. చెంచుల యొక్క స్థానిక పురాణాలు ఒకసారి మనం తెలుసుకుంటే నల్లమలలో గజ్జెలకొండ అనే ప్రాంతం ఉందని దానిని #గజ్జెలకొండరాకాసి పరిపాలిస్తుందని ఆ #గజ్జెలకొండకు #బుడమరాకాసులు కాపలాకాస్తు ఉంటారని ఒక కథ వారిలో ఉంది. ఈ బుడమరాకాసులు ఆ పుట్టుపాపలకు ఏమైనా సంబంధం ఉందా!
అలాగే #కాశినాయన అన్ని ప్రాంతాలు తిరుగుతున్న క్రమంలో గిద్దలూరు 50 కిలోమీటర్ల దూరంలో ఒక కొండమీద ప్రాచీన కాలము నాటి చాలా సమాధులు చూశారని వాటిపై ఉన్న రాయిని తీసి చూస్తే వాటి అస్థిపంజరాలు చాలా చిన్నవిగా ఉన్నాయని తన శిష్యులకు చూపించారు. ఆ కొండని మరుగుజ్జు పర్వతం అని అంటున్నారు. ఈ #మరగుజ్జుపర్వతం మీద ఉన్న సమాధులు ఈ పుట్టుపాపలకు చెందినవా!
https://www.instagram.com/historical....
https://www.facebook.com/vedadri.nall...
• ఆనవాళ్లు వదిలితే చాలు అంకాలమ్మే చూసుకుంటుం...
• ఉప్పుగుంతల బయన్న స్వామి | నల్లమల| బయన్నసె...
@SahasaYatrikudu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: