పంచాహ్నిక హిందూ దేవాలయ పరిరక్షణ యజ్ఞము&పరమపూజ్యశ్రీ స్వామివారి 85వ అవతరణోత్సవములు
Автор: Siddheswari Peetham
Загружено: 2021-01-17
Просмотров: 3061
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ దేవాలయ పరిస్థితులను, పరిణామములను గమనించి వాని పరిరక్షణకు దేవతానుగ్రహమును, దివ్యచైతన్యమును అవతరింపజేయటం ప్రధానమని, అవసరమని భావించి పరమపూజ్యులు, నడిచేదైవం, మంత్ర స్వరూపులు, కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు, శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులు, పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామివారు పంచాహ్నికముగా హిందూ దేవాలయ పరిరక్షణ యజ్ఞమును సంకల్పించారు. శ్రీ శక్తిపీఠంలో, పరమ పూజ్యులు శ్రీ స్వామివారి దివ్య సమక్షంలో, శ్రీ శక్తిపీఠాధీశ్వరి, మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ రమ్యానందభారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో 5 రోజులపాటు (21-01-2021 గురువారం నుండి 25-01-2021 సోమవారం వరకు) జగద్గురువులు, ఆదిశంకర భగవత్పాదాచార్యులవారు నిర్దేశించిన పంచాయతన మార్గంలో దేవతాపూజలు, అభిషేకములు, శైవ - వైష్ణవ - శాక్తేయ - గాణాపత్య - సౌర యజ్ఞములు జరుగును. వేద, సాహిత్య, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమములు ఏర్పాటు చేయటమైనది. పరమపూజ్యశ్రీ స్వామివారు 84 సంవత్సరములు పూర్తి చేసుకొని 85వ సంవత్సరములోకి ప్రవేశిస్తున్న సందర్భంలో శ్రీ స్వామివారికి విశిష్ట దర్బారు సేవ, పాదపూజ, పుష్పాభిషేకము జరుగును. ప్రత్యేకంగా ఈ సమయములో వేయి శివలింగములతో భాసిస్తున్న శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి ప్రతిష్ఠ జరుగును.
Website : http://www.siddheswaripeetham.org/
Facebook : / siddheswarananda-bharati-swamy-16128905073...
Phone: 8639466355 || 9160455255 || 9490428387 || 8977788055
USA: 001 678 643 8133
© 2020 Sri Siddheswari Peetam
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: