1966 సంక్రాంతి చిత్రాలు "జమీందార్" "మొనగాళ్ళకు మొనగాడు" చిత్రాల్లో ఏది బెస్ట్?
Автор: Radio Rambabu
Загружено: 2026-01-24
Просмотров: 5907
#anr #svrangarao #nagabhushanam #oldtelugumovies #telugucinema #oldtelugucinema #radiorambabu #oldtelugumoviereview #madhusudanarao #krishnakumari #balayya #satyanarayana #suryakantam #chalapatirao #narayanareddy #harinadh #chalam #ravindraarts #mikkilineni #moderntheatres #savitrishort #geminiganesan #ashokkumar
1966సంవత్సరం సంక్రాంతికి జమీందార్, మొనగాళ్లకు మొనగాడు అనే రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి..
రెండింటిలో జమీందార్ Charade అనే ఇంగ్లీషు సినిమాకు అనుకరణ.కథను ముళ్ళపూడి వెంకటరమణ డెవలప్ చేశారు.. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బేనర్ పై తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించారు. వి.మధుసూదనరావు డైరెక్ట్ చేశారు.మ్యూజికల్ గా బావుంటుంది.
ముఖ్యంగా “ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను” పాట
ఇంకో డ్యూయెట్ “నీతోనే ఉంటాను శేషగిరి బావా..నీ మాట వింటాను మాటకారి బావ” ..మరో డ్యూయెట్ “పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు”.. ఈమూడు సి.నారాయణరెడ్డి రాసినవే..
ఇందులో పోకిరి లాంటి ట్విస్ట్ ఉంటుంది.. అల్లరి చిల్లర గా తిరిగే హీరో సి.ఐ.డి.ఇన్స్పెక్టర్ అని తేలటం విశేషం.
అక్కినేని, కృష్ణ కుమారి లు హీరో, హీరోయిన్లు గా నటించారు.నాగభూషణం ఎప్పటి లానే తేనె పూసిన కత్తి లాంటి విలన్.. అదనంగా మిక్కిలినేని, సత్యనారాయణ, నెల్లూరు కాంతారావు విలన్లుగా నటిస్తే గుమ్మడి,హేమలత హీరో అన్న వదినలు.. సూర్యకాంతం, రేలంగి కామెడీ లోటు భర్తీ చేశారు..
అక్కినేని ఈ సినిమా లో లావుగా కనిపించారు..ఆ విగ్ కూడా సెట్ కాలేదు.ఆయన వేసుకున్న సూట్లు చాలా లూజ్ గా ఉండి నప్పలేదు.. లింగమూర్తి కూడా పార్ట్ విలన్..
రెండో ప్రపంచ యుద్ద సమయంలో రవాణా చేస్తున్న డబ్బు ని నొక్కేసిన మిత్రులు పాతికేళ్ల తర్వాత ఆ డబ్బు కోసం తగవు పడుతుంటారు..ఆ డబ్బు మిస్టరీ ని ఛేదించడానికి వచ్చిన హీరో అక్కినేని ఆ మిస్టరీ ని ఎలా ఛేదించారన్నది కథ..ఇది సగం సాంఘికం.. సగం క్రైం..
ఇంకా మొనగాళ్ళకు మొనగాడు సినిమా పూర్తి క్రైం కథ.. ఉస్తాదోంకా ఉస్తాద్ అనే హిందీ సినిమా రీమేక్..మోడరన్ థియేటర్స్ వాళ్ళు మొదట తమిళంలో రీమేక్ చేశారు..అది వారి నూరవ చిత్రం..అక్కడ హిట్ అయ్యాక తెలుగు లో తీశార
ఈ సినిమా కి లైఫ్ ఎస్వీఆర్..కత్తుల రత్తయ్య గా ఆయన మేనరిజమ్స్, డయిలాగ్ డెలివరీ ఒక ఒరవడి సృష్టించింది.
ఆయనకి సపోర్ట్ గా హరినాథ్ చలం, ప్రభాకరరెడ్డి,బాలయ్య, రావి కొండలరావు నిలబడ్డారు.ఈ చిత్రం లో కూడా కృష్ణ కుమారి హీరోయిన్.. ఎస్వీఆర్ odd personality ని అడ్వాంటేజ్ గా మలిచాడు దర్శకుడు ఎస్.డి.లాల్..కెమేరా ఆయన తమ్ముడు ఎస్.ఎస్.లాల్..మోడరన్ థియేటర్స్ సుందరం కి ఎస్.డి.లాల్ అంటే బాగా నమ్మకం..ఈ సినిమా కామెడీ ట్రాక్ భుజాన వేసుకుంది చలం.. జమీందార్ తో పోలిస్తే హరినాథ్,చలం యంగ్ బ్యాచ్..
పాటల్లో సౌబార్ జనమ్ లేంగే అనే పాటను యథాతథంగా దింపేశారు..నేనున్నది నీలో అంటూ..
అలాగే సావిత్రి తో ఖవ్వాలీలో యాక్ట్ చేయించారు.. దానికి కారణం ఆవిడకు వాళ్ళంటే ఉన్న గౌరవం..ఇంకో హిందీ పాటను దింపేశాడు వేదా..వచ్చానే నీకోసం..మెచ్చానే నీ వేషం అన్న ఖవ్వాలీలో ఎస్వీఆర్, హరినాథ్ గెటప్ లు అదిరిపోయేట్టు ఉంటాయి
రెండింటిలో రీరికార్డింగ్ బావుంది..
బాలయ్య కు విలన్ రోల్ అవటం అందరినీ ఆశ్చర్యపరిచింది.కాంతారావు, జగ్గయ్య, గుమ్మడి వీళ్ళందరినీ కాదని బాలయ్యకు ఇవ్వటానికి కారణం ప్రొడ్యూసర్ సుందరం..
ఆయన డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి రషెస్ చూపి కన్విన్స్ చేశారు..
బాలయ్య కు ప్రతిరోజూ డైరెక్టర్ ఎస్ డి లాల్ డైలాగులు ప్రాక్టీస్ చేయించేవారు..ఇందులో కూడా కత్తుల రత్తయ్య లాంటి రౌడీ పాత్ర చివరికి ఇన్స్పెక్టర్ అని చివర్లో తేలటం విశేషం..దొంగలముఠా నాయకుడు కూడా పోలీసు అధికారి అని తేలటం మరో విశేషం
ఫైనల్ గా రెండింటిలో ఏది హిట్.. ఏది బావుంటుంది అంటే పెద్ద విజయం సాధించిన చిన్న సినిమా మొనగాళ్లకు మొనగాడు..
పెద్ద బేనర్ లో వచ్చిన పెద్ద సినిమా జమీందార్..
అంతకు ముందు చిత్రం లక్షాధికారి అంత విజయం సాధించిందా అంటే లేదు..రెండూ సంక్రాంతి హిట్లే..
ఇప్పటికీ గుర్తుండే పోయే చిత్రం మొనగాళ్ళకు మొనగాడు
సి.యస్.రాంబాబు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: