ఎంతకాలము - ఇంకెంత కాలము // అద్భుతమైన గీతం
Автор: Nissi Prayer House
Загружено: 2025-12-12
Просмотров: 3920
: Lyric's
Ps T. Praneeth Kumar
: Song Composting
Boda Ramesh
Contact: 9490741226
పల్లవి : ఎంత కాలము - ఇంకెంతకాలము
మోసపోకురా నీవు మాసిపోదువురా "2"
వ్యర్థమురా వ్యర్థమురా
సమస్తము వ్యర్థమురా
ఈ బంధాలన్నీయు - చివరికి వ్యర్థమురా "2"
"ఎంత"
1. ఎన్ని ఆస్తులున్నను - తృప్తి ఉండదురా
ఎంత సంపాదించిన - వెంటరావురా "2"
ప్రభుని నమ్మరా... పాపం విడువరా
ఆత్రపడకురా... నీవాలోచించరా "2"
"ఎంత"
2. ఎంతకాలమున్నను - మరణం తప్పదురా
మన్నైనా ఈ శరీరం - మట్టిలోనే కలయురా "2"
ప్రభువుని నమ్మరా... పాపం విడువరా
బుద్ధి హీనముగా... నీవు తిరగబోకురా "2"
"ఎంత "
3. సుగంధతైలముకంటె - మంచి పేరు మేలురా
నెమ్మధిలేని ధనము కంటే - పేదరికం హాయిరా "2"
ప్రభువుని నమ్మరా... పాపం విడువరా
లోకాశలు విడచి... ప్రభుచెంత చేరరా "2"
"ఎంత"
*********************************************
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: