జగన్మాత ఈశ్వరి మహాదేవి 236వ ఆరాధనా మహోత్సవం, కొత్తపేట, విజయనగరం
Автор: Pramodha Vlogs
Загружено: 2025-12-14
Просмотров: 5
జగన్మాత ఈశ్వరి మహాదేవి 236వ ఆరాధనా మహోత్సవం, కొత్తపేట, విజయనగరం
🙏🌹🪴🌹🙏ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ కలిపాపహరణావతార రూపిణ్యై నమః.
🦜🌻🦜🌻🦜🌻🦜🌻🦜
జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి. వీరబ్రహ్మేంద్ర స్వాములవారి పౌత్రి సాక్షాత్ పరమేశ్వరీ స్వరూపిణి జగన్మాత శ్రీ ఈశ్వరీ మహాదేవి అమ్మవారు సజీవ సమాధిలోకి ప్రవేశించిన పవిత్ర సుధినమైన మార్గశిర మాస బహుళ నవమి తో కూడిన స్థిరవారం అయిన ఈరోజున
అమ్మవారి "236" ఆరాధన గురుపూజా మహోత్సవమును
విజయనగరం పట్టణ కొత్తపేట గొల్లవీధిలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో దేదీప్యమానంగా కొలువై ఉన్న జగన్మాత శిలామూర్తికి భక్తుల ఆద్వర్యంలో పంచామృతములతోను, పసుపు,కుంకుమ,గంధములతోను,వివిధ రకముల పండ్ల రసములతోను, సుగంధ పరిమళ ద్రవ్యజలములతోను, నారికేళఫల జలములతోను, విశేష అభిషేకములు, తదుపరి, అలంకరణ,మరియు ,మహిళామణులచే కుంకుమార్చన,తదుపరి మంగళహారతితో, పూజా కార్యక్రమములు అత్యంత వైభవంగా జరిగినవి.ఆ తదుపరి తీర్థప్రసాద వితరణ జరిగినవి. ఇంతటి మహోన్నతమైన జగన్మాత ఆరాధనా పూజా మహోత్సవములో అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులకు శ్రీ ఈశ్వరీ మహాదేవి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండాలని కోరుతూ...
🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹
ఇట్లు :-
జగద్గురు శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి వారి భక్తబృంధం. కొత్తపేట గొల్లవీధి. విజయనగరం.
🙏జై వీరబ్రహ్మ జై - గోవిందమాంబ జై.
🙏జై జగన్మాత జై - జై ఈశ్వరాంబ జై.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: