NADIPINCHE DEVUDU | నడిపించే దేవుడు | Telugu Christian Song.
Автор: MAHIMAMINISTRIES NAGARKURNOOL
Загружено: 2026-01-18
Просмотров: 338
Presented by MAHIMA MINISTRIES
నడిపించే దేవుడు
Lyrics, Tune, Vocal : Revalli Samuel
Music : Revalli Samuel, Pradeep Sagar
DOP : Deepak Paul
Video Editing : Joshua Josh
Special Thanks:
Pastor R.Joseph & Jyothi
V. John & Rebecca
R. Vijaya Joycee & Mahima
For all your prayer request, please contact us:
Contact Numbers: 8096309363, 7396936640.
నడిపించే నా దేవుడు అనే ఈ గీతం నా ఆత్మలోనుంచి పుట్టిన ఒక ప్రార్థన. జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలు, ఒంటరితనం, భయాలు ఎదురైనప్పటికీ దేవుడు ఎప్పుడూ మనతోనే ఉన్నాడని గుర్తు చేసే గీతం ఇది.
అంధకార మార్గాల్లో కూడా ఆయన మన చేయి విడువడు, కన్నీటి వేళల్లో ఆయన సన్నిధి మనకు ఓదార్పుగా నిలుస్తుంది. ఆశలేని పరిస్థితుల్లో ఆయన మన ఆశగా, బలహీనతలో మన బలంగా మారతాడు.
ప్రతి అడుగులో దేవుని నడిపింపును అనుభవించిన జీవితం ఈ పాట ద్వారా ప్రతిఫలిస్తుంది. అలసిపోయిన ఆత్మలకు ఇది నూతన బలాన్ని, విరిగిన హృదయాలకు శాంతిని అందిస్తుంది.
ఈ పాట మీ జీవితాలను మహిమ కరముగాను ఆశీర్వాదకరము గాను ఉండలని కోరుతూ ఈ గీతమును మీకు అంధిస్తునాము.
Song Lyrics:
నడిపించుమ నీ సేవలో
ఫలియించేద నీ సాక్షిగా
అవరోధాలైన ఆపదలు ఎదురైనా విడువక నీతో నడిచెదను
శత్రువు ఎదిరించిన రంకెలేసిన విజయోత్సవముతో నిలిచెదను
" ఆరాధన ఆరాధన నా ప్రియుడా నీకే ఆరాధన " 2
1. సింహాల బోనులో పడవేసిన అగ్నిగుండంలో త్రోసేసిన
శత్రువు గెలిచేనని సంతోషించుచు వారి మరణము కొరకు ఎదురుచూచుండగా
సింహాలనోలను మూసితివి అగ్నిగుండంలో నిలిచితివి
మరణపు ముల్లును విరిచితివి సజీవులుగా నిలిపితివి
"ఆరాధన ఆరాధన నా ప్రియుడా నీకే ఆరాధన" 2
2 . ఆత్మీయ జీవితంలో ప్రయాణించుచున్న అపోస్తుల జీవితంలో ఎదురయే శ్రమలు
శోధన వేదన కష్ట సమయంలో శత్రువు బెదిరించి హింసించిన
సాహస కార్యములు చేసితివి విజయోత్సవముతో నిలిపితివి
విలువైన ని కృపను చూపితివి
విశ్వాస వీరులుగా నిలిపితివి
"ఆరాధన ఆరాధన నా ప్రియుడా నీకే ఆరాధన" 2
3. నీ పిలుపు వినగానే నీకు లోబడి నీ సేవలో కొనసాగుచుండగా
ఎన్నో అవమానాలు నిందలు ఎదురై నానువారే దూషించగా
నా వల్ల కాదని వెను తిరుగు సమయంలో నేనున్నానని బలపరచితివి
నీ అనుభవాలను చూపించుచు ఇలలో అనేకుల యెదుట నిలిపితివి
"ఆరాధన ఆరాధన నా ప్రియుడా నీకే ఆరాధన"2
నడిపించుమ నీ సేవలో
ఫలియించేద నీ సాక్షిగా
అవరోధాలైన ఆపదలు ఎదురైనా విడువక నీతో నడిచెదను
శత్రువు ఎదిరించిన రంకెలేసిన విజయోత్సవముతో నిలిచెదను
" ఆరాధన ఆరాధన నా ప్రియుడా నీకే ఆరాధన " 2
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: