కసాపురము తేది.31.10.2025 న నిర్వహించు “రాజగోపురముల శిఖర ప్రతిష్ట” ప్రత్యక్ష ప్రసారము 11.11am,ల
Автор: Sri Nettikanti Anajaneya Swamy Devasthanam
Загружено: 2025-11-03
Просмотров: 137
శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం, కసాపురం, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లా.15 వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల రాజగురువు శ్రీ వ్యాసరాయలు వారిచే ప్రతిష్ఠిచబడిన "శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం, కసాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని ప్రధాన దేవాలయములలో ఒకటిగా, ఆంజనేయ స్వామి క్షేత్రం గా విరాజిలుతున్న దేవస్థానం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రములనునుండి భక్తులు అశేష సంఖ్యలో ఆంజనేయ స్వామి వారి దర్శనార్ధం వచ్చి స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిద్రచేసి ఆ స్వప్నంలోనే వారి ఈతి బాధలకు పరిష్కారాన్ని సూచిస్తారనే నమ్మకం తో ఇక్కడ నిద్ర చేయడం ఆచారం.
స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులకు, రక్షణ, శత్రువులను జయించే ఆత్మ స్థైర్యం,మనోధైర్యం, ఆరోగ్యం, విద్య లతోపాటు దుష్ట శక్తుల నివారణ,శనిదోషాలు, దుష్ట గ్రహ బాధలు తీరుతాయని, మరియు కుటుంబ సుఖశాంతులు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు కార్తీకమాసం లో హనుమత్ దీక్షాదారులై 41 రోజులపాటు అత్యంత నిబధ్ధతతో నియమాలు పాటిస్తూ "సింధూర వస్త్ర ధారణ" తో స్వామి వారి దర్శనానికి వేల సంఖ్య లో రావడం పరిపాటి. ఈ సంవత్సరం అక్టోబర్ 22 ణ ప్రారంభమైన " హనుమత్ దీక్ష" డిసెంబర్ 3 వ తేదీన విరమణ తో పూర్తవుతుంది.దేవస్థానం నందు ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులు
1. దేవాలయ ముఖద్వారం ముందు దేవాలయమును మూసివేసినట్లుగా ఉన్న దాదాపు 68 షాపుల తొలగింపు.
2. దేవస్థానం ఉత్తరం, పడమర వైపు శిడీలువస్థలో ఉండి ఎప్పటినుండో వాడకం లేని రామసదనం, లక్ష్మణ సదనం వసతి గదుల తీసివేత.
3. దేవస్థానం నలువైపులా మాడా వీదుల ఏర్పాటుకు సీసీ ఫ్లోరింగ్ ఏర్పాటు
4. దేవస్థానం దక్షిణవైపు సీసీ రోడ్డు కు ముందుభాగంలో ఇరువైపులా రాతితో కాంపౌండ్ వాల్ నిర్మాణం, రక్షణ నిమిత్తం 3 ఇనుప గేట్లు ఏర్పాటు.
5.దక్షిణ రాజగోపురం ముందు భాగంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు.
6. దేవాలయ ప్రాంగణంలో పచ్చదనం, పరిశుభ్రత దిశగా దాదాపు 10 అడుగుల ఎత్తున్న దేవతా వృక్షాలు, ఇతర మొక్కలు ఏర్పాటు.
7. దక్షిణ రాజగోపురము ముందు భాగములో ఇరువైపులా సమానముగా లెవెల్లింగ్ చేసి, భక్తుల కాలికి మట్టి అంటకుండా సీసీ పేవార్స్ ఏర్పాటు.
8. దేవాలయ సరిహద్దు నిర్ణయిస్తూ ప్రీ క్యాస్ట్ వాల్ ఏర్పాటు.
9. గంగా నిలయం ముందు, రాతి మండపం ముందు, డార్మిటరీ షెడ్ ప్రక్కన, సుందర నిలయం ముందు, తూర్పు రాజగోపురం ముందు భాగంలో పాడైపోయిన రోడ్ల స్థానంలో సీసీ ఫ్లోరింగ్ ఏర్పాటు.
9. భక్తుల సౌకర్యార్థం ఉచిత దర్శనం చేసుకొనుటకు కలర్ కొటెడ్ షీట్ తో షెడ్ ఏర్పాటు.
10. తూర్పు వైపున్న గోశాలను తోట వద్ద ఏర్పాటు.
11. దేవస్థానం నిర్వహించు గోశాల నిమిత్తం తోట వద్ద దాదాపు దాత ద్వారా కోటి రూపాయలు అంచనాలతో నూతన గోశాల నిర్మాణం.
12. తాత్కాలిక షాపుల ఏర్పాటుకు చర్యలు.
13. అన్నదానం కొరకు నూతనముగా వంటసామాగ్రి, టేబుల్స్, సప్లై సామానుల ఏర్పాటు.
14. దేవస్థానం దక్షిణం వైపు రోడ్డుకు ముందు భాగంలో దేవాలయ స్థలంలో జంగల్ క్లియరెన్స్ చేసి రోడ్ ఏర్పాటు.
15. పోలికి, కసాపురం గ్రామ సరిహద్దు లలో ఉన్న దేవస్థానం భూములు దాదాపు 14 సంవత్సరం లనుండి బీడు గా ఉండి పిచ్చి మొక్కలు పెరగడం తో వాటిని తొలగించి, సాగు చేసుకొనుటకు ఎవ్వరూ ముందుకు రానందున వాటిని దేవస్థాన పల్లకి,
అవుట్ సౌర్చింగ్, శానిటేషన్ సిబ్బందితో "సెల్ఫ్ కల్టీవేషన్" చేయుటకు ఏర్పాట్లు.
16. 2022,2024 ఆర్థిక సంవత్సరం లకు income tax సకాలములో ఫైల్ చేయకపోవడం వలన Income Tax డిపార్ట్మెంట్ వారు రూ. 5,67,00,000/- లకు డిమాండ్ గా చెల్లించవలసిన ఆదేశాములపై Chief Income Tax Officer, Hyderabad వారి నుండి stay orders పొంది అన్నీ సంవత్సరం లకు returns ఫైల్ చేయడం.
17. దేవస్థానం నకు Income Tax Department సెక్షన్ 80 (G) ప్రకారం సర్టిఫికెట్ కొరకు చర్యలు.
18. దేవస్థానం నందు గత 23 సంవత్సరం లుగా, శాస్త్రం, ఆగమ రీత్యా చేయవలసిన "రాజగోపురముల కలశ ప్రతిష్ట, సంప్రోక్షణ కార్యక్రమములు పాంచరాత్ర ఆగమ పీఠధిపతులు శ్రీ చిన్న జీయర్ స్వామి వారి సూచనల మేరకు త్రాయఃనిక దీక్షలో అక్టోబర్ 29 నుండి 31వరకు ఏర్పాటు దేవస్థానం నందు చేపట్టాబోవు అభవృద్ధి పనులు
1. రాతితో దేవాలయం ధాత్రత్వం కల దాతలతో పునః నిర్మాణం
2. భక్తులకు ప్రతీరోజు 1000 మందికి రుచికరమైన అన్నప్రసాద వితరణ చేయుటకు నిత్య అన్నదాన శాల నిర్మాణం
3. భక్తుల వసతి కొరకు దాతల దాత్రుత్వంతో జి + 2 తో 91 వసతి గదుల నిర్మాణం
4. నాణ్యమైన,. రుచికరమైన లడ్డు, పులిహోర ప్రసాదములు తయారు చేయుటకు ప్రసాదముల తయారీశాల నిర్మాణం
5. ప్రతీ నిత్యం నాలుగు వేదాల పఠనం తో నిత్య హోమం, ఇతర హోమండి కార్యక్రమం ల కొరకు రాతితో యాగశాల నిర్మాణం
6. భక్తుల సౌకర్యార్థం దేవాలయ ప్రాంగణంలో 11 ప్రదక్షిణలు చేయుటకు ఫుటోవర్ బ్రిడ్జి నిర్మాణం
7. టాయిలెట్స్ నిర్మాణం
8. క్యూ లైన్స్ ఏర్పాట్లు
9. భక్తుల సౌకర్యార్థం డార్మిటా్రీల నిర్మాణం
10. బుకింగ్ కౌంటర్ ఏర్పాటు
11. దేవస్థాన పరిపాలన భవన నిర్మాణం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: