కురుమూర్తి జాతర పోయిన పోషి తాత | Poshi Thatha Went Kurumurthy jathara | MS Tv Telugu
Автор: MS TV TELUGU
Загружено: 2024-11-11
Просмотров: 15732
అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఏడుకొండల మధ్య స్వయంభూవంపై లక్ష్మి సమేతంగా వెలిసిన స్వామి పేదల తిరుపతిగా మొక్కులందుకుంటున్నాడు. కురుమూర్తి వేంకటేశ్వరస్వామి దేవస్థానం సా.శ. 1268 ప్రాంతములో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. 1350లో చంద్రారెడ్డి అభివృద్ధిపర్చగా, సోమభూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ఏటా జాతర నిర్వహించే సాంప్రదాయం అమలులోకి తెచ్చాడు. 1870లో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ప్రధాన ఘట్టం. ఈ వేడుకలు మండల పరిధిలోని వడ్డేమాన్ నుంచి ప్రారంభమవుతాయి. ఆ పాదుకలను ఈ మండపంలో ఉంచుతారు. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. 1999లో కొత్తగా మండపం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతియేటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో స్వామి వారిని హంస వాహనంపై ఊరేగిస్తారు.1966లో ఈ దేవాలయం దేవాదాయ శాఖలో విలీనం చేయబడింది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: