Places to visit in Machilipatnam | Machilipatnam Full History | Telugu Now
Автор: Telugu Now
Загружено: 2022-05-03
Просмотров: 69740
Places to visit in Machilipatnam | Machilipatnam Full History | Telugu Now
#Machilipatnam #Bandar #KrishnaDistrict #AndhraPradesh #BandarLaddu #BandarLadduMachilipatnam #MachilipatnamFullHistory #MachilipatnamHistory
మచిలీపట్నం! ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన తీర ప్రాంతం. కృష్ణా జిల్లాలో ఉన్న పెద్ద నగరం. 3వ శతాబ్దంలో శాతవాహనుల కాలం నుంచే మచిలీపట్నం ఉనికిలో ఉన్నట్టు చరిత్ర చెపుతోంది. ఆ సమయంలో దీన్ని మైసలోస్, మసిలా అని పిలిచేవాళ్లు. 17వ శతాబ్దంలో బ్రిటీష్, ఫ్రెంచ్, డచ్ దేశస్తులు మచిలిపట్నం నుంచి వర్తకం నిర్వహించేవారు. ఈ ప్రాంతాన్ని బందరు అని కూడా అంటారు. దీని వెనుక ఓ కథ ఉంది. సముద్రం ఒడ్డున ఉన్న కోట ద్వారం దగ్గర పేద్ద చేప విగ్రహం ఒకటి ఉంటుంది. అందుకే ఈ ఊరికి మచిలీపట్నం అని పేరొచ్చిందట. హిందీలో మచిలీ అంటే చేప, పట్నం అంటే పెద్ద ఊరు అని అర్థం.
కలంకారీ అద్దకానికి మచిలీపట్నం ఎంతో ప్రసిద్ధి పొందింది. దుస్తులు, తివాచీలు, వాల్ హ్యాంగింగ్స్ ... ఇలాంటివి ఇక్కడ తయారవుతాయి. ఈ కలంకారీ ఉత్పత్తులకు ఐరోపాలో డిమాండ్ అధికంగా ఉంటుంది. అలాగే వరి, నూనె గింజలు, గోల్డ్ కోటెడ్ నగలు కూడా మచిలీపట్నంలో ఎక్కువగా దొరుకుతాయి. ఇక్కడ లభ్యమయ్యే బందరు లడ్డూలు నోరూరిస్తాయి. వీటి తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతిని అవలంబిస్తారు.
ఇక మచిలీపట్నం ప్రాంతంలో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో మంగినపూడి బీచ్, దత్తాశ్రమం, పాండురంగ స్వామి దేవాలయం, ఘంటసాల ప్రముఖమైనవి. ఇవే కాకుండా విశ్వకర్మ టెంపుల్, బందరు కోట, సాయిబాబా మందిరం వంటివి దర్శనీయ స్థలాలుగా ఉన్నాయి. బందరు కోటను కూడా పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారు. మచిలీపట్నం బీచ్ లో ఉండే లైట్ హౌజ్ ... చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది.
మచిలీపట్నంలో వసతి సౌకర్యాలు కూడా చాలా బాగుంటాయి. టూరిస్టులకు అందుబాటు ధరల్లో హోటల్స్, భోజనం లభ్యమవుతాయి. మచిలీపట్నానికి వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లొచ్చు. గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి మచిలీపట్నం చేరుకోవచ్చు. అలాగే, హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, గుంటూరు నుంచి ఈ ప్రాంతానికి రైలు సదుపాయం ఉంది. ఇక ఏపీ, తెలంగాణలోని అనేక ప్రాంతాల నుంచి మచిలీపట్నానికి బస్సులు నడుస్తాయి.
డిజిటల్ మీడియా రంగంలో సంచలనం. బిజినెస్, స్పోర్ట్స్, పొలిటికల్, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఇతర రంగాల వార్తలు, విశేషాలను అందించడంలో మెరుపు వేగం. ఇవన్నీ TELUGU NOW సొంతం. రాబోయే కాలం అంతా డిజిటల్ మయం. అందుకే The Future Is Digital అనే ట్యాగ్ లైన్ తో TELUGU NOW మీ ముందుకొచ్చింది. వీక్షక దేవుళ్లు మా ఈ ఛానల్ ను ఆదరించాలని.. ప్రేమాభిమానాలను చూపించాలని కోరుకుంటున్నాం.
అలాగే మీ బిజినెస్ కు సంబంధించిన వీడియోల ప్రమోషన్, ఇతర వివరాల కోసం సంప్రదించగలరు.
Phone number - +91 9866574747
+91 8340974747
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: