జగదేకవీరుడు - జనతైక తనయుడు | JAGADEKA VEERUDU | SENSATIONAL CHRISTIAN SONG | Bro.P.SOLOMON
Автор: SOLOMON SONGS & MESSAGES (SSM)
Загружено: 2026-01-25
Просмотров: 4432
Lyrics, Tune & Vocals: Bro. P. Solomon
Music Programmed and Arranged: Prasanth Penumaka
Rhythms: Nishanth Penumaka
Recorded @ Grace Music Studio, Kavuluru
Mixed and Mastered @ AD Music Studios by Sheik Arif Dani
Edit and Vfx: David Raj
పాట గనక మీకు నచ్చితే.. వెంటనే లైక్ చేసి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి..
అలానే ఈ పాటపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా రాయండి..
అలానే చానల్ ను SUBSCRIBE చేసి ఫాలో చేయడం ద్వారా దేవునిలో మరింత బలపడండి..
అందరికీ వందనాలు..
ఈస్ట్ చోడవరం క్రీస్తుసంఘము
SCHOOL OF BIBLE EDUCATION
పల్లవి:
జగదేకవీరుడు.. - జనతైక తనయుడు..
జగమంత చేసి పాలించె దేవునికి రాకుమారుడతడు..!
మనసున్న మనుషుడు.. - నిజమైన దేవుడు..
మహిలోని మానవుల మనసు గెలిచిన మరువలేని ఘనుడు..
నీకోసం.. నాకోసం.. పరలోకం.. వదిలాడురా..
నీలాగే.. నాలాగే.. నరరూపి అయ్యాడురా..
ఇలలోనా.. మనలాగే.. శోధనలే.. చూశాడురా..
ఏ చోటా.. ఏ పాపం.. చేయకుండా పరిశుద్ధుడయ్యాడురా!ఇతడేరా.. జగదేకవీరుడితడేరా.. ఘన నీతిసూర్యుడితడేరా..
మచ్చలేని చంద్రుడితడేరా.. ఇది కథ కాదురా! || 2 ||
చరణం:
వందమందిని ఒక్కసారిగా కొట్టినోడు హీరో అయితే..
ఒక్కదగ్గరా పాపమెరుగని క్రీస్తునేమని పిలవాలి..?
అందగత్తెల వెంట పడుతున్న వాళ్లనే స్టారులంటుంటే..
వేశ్యనైన అమ్మగా చూసిన క్రీస్తుకే బిరుదులివ్వాలి..?
ఫిక్షన్లు కాదురా.. స్టోరీలో కాదురా..
నిజంలో రాజురా.. నా యేసు..
పాపాన్ని గెలిచిన.. మరణాన్ని చంపిన..
దమ్మున్నవారురా మా బాసు..
గాయాలు చేసినా.. ప్రాణాలు తీసినా..
క్షమించె చూడరా.. ఆ యేసు..
ద్వేషాలు ఏలరా.. దూషన్లు ఏందిరా..
వర్కౌటు కాదురా.. టైం వేస్టు..
వదిలేయ్ రా.. మతమౌఢ్యమంత -
విడిచెయ్ రా.. గతనీచమంత..
కడిగెయ్ రా.. ఇక పాపమంత..
ప్రభు రుధిరం.. నిను పిలిచిందిరా. || వదిలేయ్ రా ||
చరణం:
లోకమంత పాపాల వెంట పరుగెట్టుకుంటు వెళ్లిపోతుంటే..
పాపిగానెమరణించి నువ్వు నరకానికెళ్ళిపోకూడదనే..
తండ్రి సెలవుపై మహిమనొదిలి ఈ ధరణికొచ్చి ప్రాణాలిఇస్తే..
తనను తిట్టి హేళనలు చేసి మరి ఘోర పాపివైపోకంతే..
మనసుంటే చూడరా.. తెలివుంటె వాడరా..
ఇటువంటి దేవుడెక్కడున్నాడురా..?
ప్రాణాలు పెట్టిన.. దేవుళ్ల జాబితా..
ఉండుంటే చూపరా.. ఎక్కడైనా!
చందాలు కాదురా.. పదివంతు కాదురా..
ఇవ్వాల్సినది నీ దేవునికి..
పరిశుద్ధుడవ్వరా.. ప్రభుకీర్తి చాటరా..
ప్రకటించి చెప్పు నీ పొరుగువానికి!
లోకమంతా ఒక మాయలేర.. మనసంతా ఇక మోసమేర..
మనమంతా.. మరి వెళ్ళవలెను.. మనకున్నా నిత్యజీవానికే..!
|| లోకమంతా || జగదేకవీరుడు ||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: