కదంబవృక్ష విశేషాలు/Benefits of Kadamba Vruksham
Автор: telugu stories
Загружено: 2025-08-22
Просмотров: 4408
@telugustoriespodcast #benefitsofkadambavruksham #కదంబవృక్షవిశేషాలు
/ @telugustoriespodcast
playlist: • అవి ఇవి
కదంబ పుష్పాలను సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. శ్రావణమాసపు పూజలూ, వ్రతాల్లో వీటిని విరివిగా వాడతారు. కదంబాలు జగన్మాతకూ ఇష్టమైనవే కాబట్టే, 'కదంబ వనవాసినీ, కదంబకుసుమ ప్రియా' అంటూ లలితా సహస్రనామం ఆ తల్లిని స్తుతిస్తుంది. పురాణాల్లోనూ ఈ మహావృక్షానికి సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. ఔషధ మొక్కగానూ కదంబానికి ఎంతో పేరు. ఆసక్తికరమైన ఆ వివరాల్లోకి వెళితే...
ఒక్క బిల్వదళంతో పూజించినా... పొంగిపోతాడు ఆ శివయ్య! చిన్న తులసీదళం సమర్పించగానే... పరవశించిపోతాడు శ్రీమహావిష్ణువు! గరికతోనే గణపయ్య పూజకి కళ. ఇలా ఆయా దేవతలకు ఇష్టమైన పుష్పాలూ, పత్రాలతో నిత్యం పూజలు చేస్తుంటాం. అలాగే, ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే కదంబం పూలంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. తెల్లని తెలుపుతో చూడముచ్చటగా ఉంటాయివి. మొగ్గగా ఉన్నప్పుడు ఆకుపచ్చని బంతుల రూపంలో ఆకట్టుకుంటాయి. క్రమంగా పసుపు పచ్చగా మారిపోతాయి. చివరగా, చిన్నచిన్న తెల్లని రేకలతో పూబంతిలా కనువిందు చేస్తాయి. ఆకారమే కాదు, ఆ సువాసనలూ ప్రత్యేకమే. వానాకాలంలో విరగబూస్తూ... లక్ష్మీదేవి పూజల్లో భాగం అవుతుంటాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 'కదంబోత్సవం' పేరుతో ఈ వృక్షానికి ప్రత్యేక పూజలూ జరుపుతుంటారు. పురాణాల్లో 'కడిమి, రుద్రాక్షాంబ, కృష్ణప్రియ'... తదితర పేర్లతో ఈ చెట్టు ప్రస్తావన కనిపిస్తుంది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: