class 15 | PODU | TENSES | prabha palukulu | SPOKEN TAMIL |
Автор: PRABHA PALUKULU
Загружено: 2020-04-18
Просмотров: 10723
#prabhapalukulu#spokentamilthroughtelugu#
CLASS-15
పోడు -వెయ్
PRESENT TENSE
పోడ్‌రేన్(వేస్తున్నాను), పోడ్‌రే(వేస్తున్నావు),
పోడ్‌రాల్(వేస్తోంది), పోడ్‌రాన్(వేస్తున్నాడు),
పోడ్‌రీంగ(మీరు వేస్తున్నారు), పోడ్‌రాంగ(వేస్తున్నారు), పోడ్‌రోం(వేస్తున్నాము)
పోడ్‌రదిల్లే (వేయడంలేదు)
పోడ్‌రదిల్లియా?(వేయడం లేదా?)
EX. నాన్ ఇప్పు బ్యాంకు అకౌంటిల్ కాసు పోడ్‌రేన్
నేను ఇప్పుడు బ్యాకు ఖాతాలో నగదు వేస్తున్నాను
నీ కేకామలే ఎన్ అకౌంటిల్ కాసు పోడ్‌రే
నువ్వు అడగకుండానే నా ఖాతాలో డబ్బు వేస్తున్నావు
నీ కేకామలే ఎన్ తునీ పోటుకిరే
నువ్వు అడగకుండానే నా దుస్తులు వేసుకుంటున్నావు
అవన్ పడుకురదుకు పాయ్ పోడ్‌రాన్
అతడు పడుకునేందుకు చాప వేస్తున్నాడు
అవల్ కొలంబిల్ ఉప్పు పోడ్‌రాల్
ఆమె కూరలో ఉప్పు వేస్తోంది
నీంగ మేకప్ పోడ్‌రీంగ-మీరు మేకప్ వేస్తున్నారు
అవంగ వెలియ పోరదుకు సెరుప్పు పోడ్‌రాంగ
వాళ్లు బయటకు వెళ్లేందుకు చెప్పులు వేస్తున్నారు
నాంగ కోయిల్ పోనప్పు హుండియిల్ కాసు పోడువోం
మేం గుడికి పోయినప్పుడు హుండీలో డబ్బులు వేస్తాం
పోడ్‌రదిల్లే ( వేయడంలేదు)
నరియపేరు పడిచ్చవంగ ఓటు పోడ్‌రదిల్లే
చాలా మంది చదువుకున్నవారు ఓటు వేయడం లేదు
తాతావుక్కు బీపీనాల కొలంబిల్ జాస్తియా కారం పోడ్‌రదిల్లే
తాతకు బీపీ వల్ల కూరలో ఎక్కువ కారం వేయడం లేదు
పోడ్‌రదిల్లియా?(వేయడం లేదా )
ఉంగ అప్పా అకౌంటిల్ కాసు పోడ్‌రదిల్లియా
మీ నాన్న ఖాతాలో డబ్బు వేయడంలేదా?
PAST TENSE
పోట్టేన్(వేశాను), పోట్టే(వేశావు),
పోట్టాల్(వేసింది), పోట్టాన్(వేశాడు),
పోట్టీంగ(మీరు వేశారు), పోట్టాంగ(వారు వేశారు)
పోట్టోం(వేశాం),
పోడలే (వేయలేదు)
పోడలియా?(వేయలేదా?)
EX. నా సడన్ బ్రేక్ పోట్టేన్- నేను సడన్ బ్రేక్ వేశాను
ఫ్యాన్ స్విచ్చ్ పోట్టేన్- నేను ఫ్యాన్ స్విచ్ వేశాను
నీ వాషింగ్ మెషినిల్ తుని పోట్టే
నువ్వు వాషింగ్ మెషిన్‌లో దుస్తులు వేశావు
అవల్ ముడికి కలర్(నిరం) పోట్టాల్
ఆమె జుట్టుకు రంగు వేసింది
అవన్ ఎన్ తోల్ మేల కై పోట్టాన్
అతడు నా భుజం మీద చెయ్యి వేశాడు
నీంగ అకౌంటిల్ ఎవ్‌ల కాసు పోట్టీంగ
మీరు అకౌంట్‌లో ఎంత సొమ్ము వేశారు
అవంగలై పుడిచ్చి జైలిల్ పోట్టాంగ
వారిని పట్టుకుని జైల్లో వేశారు
కేసీఆర్ ఏలైగల్ అకౌంటిల్ 1500 పోట్టార్
కేసీఆర్ పేదల ఖాతాలో 1500 వేశారు
నాంగ ఓటు పోట్టోం- నీంగ పోట్టీంగ్లా?
మేం ఓటు వేశాం - మీరు వేశారా?
పోడలే(వేయలేదు)
అవన్ పేపర్ కిలిచి డస్ట్‌బిన్నిల్ పోడలే
అతడు పేపర్ చింపి డస్డ్‌బిన్‌లో వేయలేదు
నా కల్లు తూకి పోడలే- నేను రాయి విసిరేయలేదు
పోడలియా? (వేయలేదా?)
ఇదువరైకు నీ అయ్యప్పమాలై పోడలియా?
ఇదివరకు నువ్వు అయ్యప్పమాల వేయలేదా?
FUTURE TENSE
పోడువేన్(వేస్తాను), పోడువే(వేస్తావు),
పోడువాల్(వేస్తుంది), పోడువాన్(వేస్తాడు),
పోడువీంగ (మీరు వేస్తారు), పోడువాంగ(వేస్తారు)
పోడువోం(వేస్తాం )
పోడమాట్టేన్(వేయను), పోడమాట్టే(వేయవు),
పోడమాట్టాల్(వేయదు), పోడమాట్టాన్(వేయడు),
పోడమాట్టీంగ(మీరు వేయరు), పోడమాట్టాంగ(వేయరు), పోడమాట్టోం(వేయము),
పోడమాట్టియా? (వేయవా?)
పోడమాట్టీంగ్లా? (వేయరా? )
నాన్ ముగత్తుకు పౌడర్ పోడువేన్
నేను ముఖానికి పౌడర్ వేస్తాను
నీ అడికడికి మేకప్ పోడువే
నువ్వు తరచూ మేకప్ వేస్తావు
అవల్ ఎప్పుమే నల్ల డ్రెస్ పోడువాల్
ఆమె ఎప్పుడైనా మంచి డ్రెస్ వేస్తుంది
అవన్ ఎప్పుమే టీషర్ట్స్‌దా పోడువాన్
అతడు ఎప్పుడూ టీష్టర్టులే వేస్తాడు
నీంగ ఎదుకు ఎప్పో షూ పోడువీంగ
మీరు ఎందుకు ఎప్పుడూ షూ వేస్తారు
అవంగ టీయిల్ జాస్తియా సక్కరై పోడువాంగ
వారు టీలో ఎక్కువ చక్కెర వేస్తారు
నాంగ వెలియ పోనా కాలుకు సెరుప్పు పోడువోం
మేం బయటికి వెళ్తే కాళ్లకు చెప్పులు వేస్తాం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: