రావయ్య శ్రీ గౌరీ తనయ (కవి శ్రీనివాసుని కీర్తన) హార్మోనియం లెసన్
Автор: Vagdevi harmonium lessons
Загружено: 2025-11-30
Просмотров: 1366
రావయ్య శ్రీ గౌరీ తనయ మమ్ము
కరుణించి కాపాడ వయ్యా
రావయ్య గజరాజా వదనా సుందర రూప
దేవ దేవ వా మమ్ము దరిజేర్చి రక్షించు
నిన్నే దలతుమయ్య మొదలు లడ్డు
ఉండ్రాళ్ళు అర్పించెదాము
పానకము వడపప్పు పాయసము చలిమిడి
తేనె పరమాన్నములు తనివార భుజియించు
విజయము చేకూర్చవయ్య మా
విజయ గణపతి నీవెనయ్య
ముజ్జగరక్షక ముక్తిప్రదాయక
సుజన పాలక నీవే నిజ భక్త మందార
ధరణిలొ ముంబాపురమున నీ
దాసుడు కవి శ్రీనివాసు
సరగున రావయ్య వరసిద్ధి గణపయ్య
భారము నీదయ్య భజన భక్తుల బ్రోవ
రెండవ పాట
అయ్యేటి పని ఏమో కానీ రామ
సయ్యాన నీ దయ రాని
అయ్యేటి పనికింత అనుమానమేమిరా
వెయైన నినుమాన విశ్వకారణ రూప
1.నింద సన్నుతులను జెంద / దేహ-మందున మరి ప్రీతి నొంద కందర జనక నీ-కరుణ గలిగితే చాలు ముందటి కర్మము-యెందైన తొలగునా
2.నిజముగ నిను నమ్మినాను | రామ | భజన జేసితి వేడ్కతోను గజరాజ వరద నీ-కాశించి యున్నాను అజుడు వ్రాసిన వ్రాత-కనుమాన మేటికి
3.మంతనమున భీతిజెంద ( నా మనసందు విభ్రాంతినొంద
వంతు కొచ్చిన కర్మ-వశము తప్పగ బోదు
చింతింప పనియేమి-సిద్ధమై యున్నాను
4.పరమ సుందర చారు చరణా!
లోక-పావన వర ముక్తాభరణ
సరస రాకమచెర్ల-స్వామి నీ వాడను
పరగ నీదయ నాదు-ప్రాప్తము గనుగొందు
1) మూడవ పాట
రావయ్య శ్రీ వాసుదేవా । నన్ను-
రక్షించు మహానుభావా
రావయ్య నిను మహా-రాజు వనుచు మది భావించినాను నా-భారమంతయు నీదె
దాత వనుచు వేడినాను నీ-
దాసుడనై యున్న నేను
పాతక హరణా! నీ-ప్రాపు నమ్మితి నింక
యే తీరునైన న-న్నేలెద పనుకున్న ॥రావయ్య॥
పలుమారు నిను నమ్మినాను నీ-
పద పద్మముల సాక్షిగాను
తలచీ తలచి నిన్నె-పలువరించితి నింక
నళినాక్ష నన్నేల-వలెనని పొగడితి ॥రావయ్య॥
పరులకు లేశము వెరవా! నన్ను-
కరుణించ నీ కేమి బరువా?
వెరచి వచ్చితి నన్ను-వేరు జూడగ బోకు సరస రాకమచెర్ల-హరివని పొగడితి ॥రావయ్య॥
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: