మండపేట మున్సిపల్ కమీషనర్ పై MLC తోట త్రిమూర్తులు ఆగ్రహం
Автор: AB7 NEWS TELUGU
Загружено: 2025-11-29
Просмотров: 24532
మండపేట: 29 11 2025: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం:
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తన విశ్వరూపం చూపించారు. తనకు కౌన్సిల్ అజెండా ఎందుకు పంపలేదని, అదే విధంగా కౌన్సిల్ సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని కమీషనర్ టీవీ రంగారావు పై విరుచుకుపడ్డారు. మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ, అత్యవసర సమావేశాలు మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరిగాయి. సమావేశంలో ఎమ్మెల్సి తోట నిలబడి తన నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశానికి తనను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి మాట్లాడుతూ ఎమ్మెల్సీ తోట కు అజెండా పంపలేదని తనకు విషయం తెలిసిన వెంటనే మీటింగ్ క్లర్క్ దంటు శ్రీనివాస్ కు చెప్పడం జరిగిందని చెప్పారు. దీంతో ఎమ్మెల్సీ తోట మీరు చెప్పారా లేదా అని శ్రీనివాస్ ను నిలదీశారు. తను కమీషనర్ చెప్పానని శ్రీనివాస్ చెప్పగా ఇక్కడ కమీషనర్ నీళ్ళు నమిలారు. దీంతో తనను మీటింగ్ కు రావద్దని ఒక లెటర్ రాసి ఇవ్వాలని తోట డిమాండ్ చేశారు. తాను ఉన్నతాధికారులతో మాట్లాడి ఇస్తానని కమీషనర్ మరి ఇప్పుడు ఎందుకు ఉన్నతాధికారులతో మాట్లాడకుండా తనను సమావేశానికి ఆహ్వానించలేదని తోట మండిపడ్డారు. ఎమ్మెల్యే వేగుళ్ళ ఇప్పుడు కౌన్సిల్ లో ప్రకాష్ కు సంతాపం తెలియజేయాల్సి ఉంది. ఈ సారి కూర్చుంటే మరలా వచ్చే సమావేశానికి అధికారిక నిబంధనలు ప్రకారం చూసుకుందామని వారించడంతో కొద్దిసేపటికి ఎమ్మెల్సీ తోట కూర్చున్నారు.
#thotatrimurthulu #vegullajogeswararao #mandapeta #muncipality #muncipal #tdp #ycp #chandrababu #lokesh #naralokesh #chandrababunaidu #jagan #ysjagan #jaganmohanreddy
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: