దసరాలలో(17-10-2020 - 25-10-2020) శ్రీ దశమహావిద్యాదివ్యోత్సవములు
Автор: Siddheswari Peetham
Загружено: 2020-10-15
Просмотров: 4887
జగన్మాత ధర్మరక్షణ కోసం, దుష్టశిక్షణ కోసం పది దిక్కులలో దశమహావిద్యా దేవతా రూపములలో అవతరించింది. తనను పూజించే భక్తులకు చతుర్విధ ఫల పురుషార్థములను అనుగ్రహించి తరింపజేస్తుంది. దశమహావిద్యా దేవతల ఆరాధన యిబ్బందులను, బాధలను, కష్టాలను తొలగించి సకల శుభములను కార్యసిద్ధిని కలిగిస్తుంది. ప్రత్యేకించి పరమ పవిత్రమైన, మహాశక్తిమంతమైన శరదృతు శ్రీ దేవీ నవరాత్రులలో ఈ ఆరాధన అత్యంత శీఘ్రమైన దేవీ అనుగ్రహమును దివ్య ఫలితములను కలిగిస్తుంది. ఈ సందర్భంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 17-10-2020 శనివారం నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) 25-10-2020 ఆదివారం వరకు పరమ పూజ్యులు, నడిచే దైవం, పరమహంస పరివ్రాజకాచార్యులు, కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామి వారి దివ్య సమక్షంలో, శ్రీ శక్తిపీఠాధీశ్వరి, మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ రమ్యానందభారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో శ్రీ శక్తిపీఠంలో మొట్టమొదటి సారిగా “శ్రీ దశమహావిద్యా దివ్యోత్సవములు” అత్యంత విశేష రీతిలో జరుగనున్నవి. దశదిక్కుల నుండి శ్రీ దేవీ అనుగ్రహము ప్రసరించి ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను తొలగించి సమస్త మానవాళికి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యములను, కామ్యసిద్ధిని కలిగించటం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమముల ద్వారా భక్తులందరూ గురువుల, దేవతల అనుగ్రహమును పొందగలరు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: