పూజ్య స్వామి తత్త్వవిదానంద సరస్వతి గారి ఆశీస్సులతో సన్న్యాస దీక్ష కార్యక్రమం
Автор: Gita Vision
Загружено: 2025-02-01
Просмотров: 10293
Join this channel to get access to perks:
/ @gitavisionhindudharmam
#SwamiSthitaprajnanandaSaraswati #GitaVision, #BhagavadGita #Swami_Sthitaprajnananda_Saraswati
పూజ్యశ్రీ స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి, వీరు పూర్వాశ్రమంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసి శ్రీ రామకృష్ణ-వివేకానందుల రచనలకు ప్రభావితులై ఆత్మ జ్ఞానంపై గల జిజ్ఞాసతో ఋషికేశ్ వెళ్లారు. దివ్య జీవనసంఘ్-శివానంద ఆశ్రమం - యోగ వేదాంత ఫారెస్ట్ అకాడమీలో ఆధ్యాత్మిక విద్య ప్రారంభించి, తర్వాత దయానంద ఆశ్రమం - ఆర్షవిద్య గురుకులంలో మరియు చిన్మయ మిషన్ - సాందీపని సాధనాలయంలో వేదాంతాన్ని అభ్యసించి, తరువాత ఉత్తరకాశీలో గల బ్రహ్మవిద్య కుటీర్ లో ఆదిశంకరాచార్య రచించిన ప్రస్థానత్రయ భాష్యం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, శ్రోత్రియ బ్రహ్మనిష్టులు మహ మహోపాధ్యాయులు పూజ్య శ్రీ స్వామి తత్త్వవిదానంద సరస్వతి గారి వద్ద సన్యాసాశ్రమం స్వీకరించారు. సర్వశాస్త్రాల సారం, విశ్వవిజ్ఞాన శాస్త్రానికి మూలం, మానవ జన్మకు జీవనాధారం భగవద్గీత ఒక్కటే అని గ్రహించి భగవద్గీత యొక్క ప్రచారమే తన జీవితాశయంలా భావించి, దక్షిణ భారతదేశంలోకి అడుగు పెట్టారు.
పలు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో తిరుమల, భద్రాచలం, విజయనగరం, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, ఇందూరు, ఖమ్మం, నల్గొండ, వరంగల్, భాగ్యనగరం మొదలగు ప్రాంతాలలో గీతా విజన్ సత్సంగాలు చేశారు.
వీరి యొక్క ఉపన్యాసాలకు ముగ్ధులై వ్యాసఆశ్రమ పీఠాధిపతులు పూజ్య శ్రీ స్వామి పరిపూర్ణానంద గిరి మహరాజ్ వారు ”ఉపన్యాసక రత్న” అని బిరుదు ఇచ్చి స్వామి వారిని సత్కరించారు.
భారతదేశంలో సనాతన హిందూ సంస్కృతి పూర్వవైభవానికి రావాలని మళ్ళీ భారతదేశం ప్రపంచంలోనే విశ్వగురువుగా నిలవాలని మహాసంకల్పంతో పూజ్యశ్రీ స్వామి స్థితప్రజ్ఞనంద సరస్వతి వారు గీతా విజన్ ప్రాజెక్ట్ మరియు సనాతన సింధు సత్సంగ్ ట్రస్ట్ స్థాపించారు.
ఈ గీతావిజన్ వేదిక ద్వారా స్కూల్స్, కాలేజీలు, ఐఐటి / మెడికల్ క్యాంపస్ మరియు విశ్వవిద్యాలయాల్లో భగవద్గీత యొక్క ఆవశ్యకత బోధిస్తున్నారు. అదేవిధంగా భగవద్గీత దీక్షలు మరియు బాలబాలికలకు యజ్ఞోపవీత సంస్కారము, భగవద్గీత యొక్క నిజమైన తత్త్వాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది.
Swami Sthitaprajnananda Saraswati,
Flat No. 101, 16-11-20/7B, Apurupa Ananda Kuteer, Saleem Nagar Colony, Malakpet, Hyderabad - 500036, Telangana,
E-mail: ssstrust@gitavision.com
Contact No : 988 55 20000
www.gitavision.com
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: