krishna Dwaraka mystery II శ్రీ కృష్ణుని ద్వారక ఎలా మునిగిపాయిందిII ఆ రోజు ద్వారకలో అసలు జరిగింది?
Автор: SNAP CHANNEL
Загружено: 2022-08-04
Просмотров: 7896
శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు ఏం జరిగింది? ఆ ప్రళయానికి కారణం ఏమిటీ? దాన్ని ప్రత్యక్షంగా చూసినవారు ఎవరు? తదితర ఆసక్తికర విషయాలు మీ కోసం.. "ద్వారక".. ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది? సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఆ రోజు ఏం జరిగింది?: ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారాకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిపోనుందని తెలిపాడు. ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు.. శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజలు, అర్జునుడు కళ్ల ముందే జరిగింది.
ఇంతటి ప్రతిష్టాత్మకమైన నగరానికి పెను ముప్పు వాటిల్లింది. అదేమిటంటే..?? కురుక్షేత్రం గురించి అందరూ వినే ఉంటారు... ఆ యుద్ధం చివరి ఘట్టంలో దుర్యోధనుడు ఒక్కడు తప్ప..మిగిలిన తొంబై తొమ్మిది కౌరవులు తమ ప్రాణాలను కోల్పోయారు. అప్పుడు శ్రీ కృష్ణ పరమాత్మ బిడ్డలను పోగొట్టుకున్న బాధతో దుఃఖిస్తున్నటువంటి కౌరవుల తల్లి గాంధారిని పరామర్శించుట కొరకు దగ్గరకు వెళ్లగా... ఆమె కోపంతో రగిలి పోతూ ఉంటుంది. శ్రీకృష్ణుడిని చూసిన ఆమె నీకు నా బిడ్డ ప్రాణాలు కాపాడాలని ఏమాత్రం అనిపించినా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణంలో ఆపగలిగే వాడివి. కానీ నీవు అలా ఎందుకు చెయ్యలేదు అని ప్రశ్నించగా అందుకు కృష్ణుడు ఇలా ఒక సమాధానం ఇచ్చారట.. మాత గాంధారి నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వ జన్మలో ఒక హంస మరియు దానికి పుట్టినటువంటి 100 పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు. దాని కర్మ ఫలితమే ఈ జన్మలో తన దృష్టిని కోల్పోయాడు అదే విధంగా తన బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఇది ఆయన కర్మ ఫలితం, కర్మ నుండి ఎవరిని ఎప్పుడూ తప్పించ లేము అంటూ సమాధానం ఇచ్చారు.
అందుకు మరింత ఆగ్రహానికి గురైన గాంధారి దేవి... నా భర్త అంటే తప్పు చేశారు ఇది ఆయన కర్మ.. మరి ఏ పాపము ఎరుగని నాకెందుకు ఇంత పెద్ద శిక్ష అంటూ నీవు నాలాగే కనుల ముందరే నీ పిల్లలను కోల్పోయే పరిస్థితి వస్తుంది, నీ యాదవ జాతి మొత్తం నీతోటే అంతమై పోవాలి అంటూ శపించింది. అలా ఆమె శాపమే యాదవులలో చిచ్చు రగిలేలా చేసింది. పదవుల కోసం గొడవలు ఒకరినొకరు చంపుకొనే వరకు వెళ్ళింది. దాంతో కృష్ణ భగవానుడు అది చూడలేక మిగిలిన వారిని ఆ ప్రదేశం నుండి వేరే ప్రాంతానికి మార్చి తను ఈ లోకం వీడి శాశ్వతంగా వెళ్ళిపోతాను అంటూ అలాగే నా తర్వాత ద్వారకానగరం అంతమవుతుంది అని అర్జునుడికి తెలిపినట్లు పురాణాల్లో ఉంది. అలా ద్వారక వీడి అడవులకు వెళ్లిపోయిన కృష్ణుడికి పొరపాటున బాణం తగిలి మరణిస్తాడు. ఇది లోక కళ్యాణం కోసమే. కృష్ణుడి అవతారానికి ముగింపు పలుకుతాడు. అనంతరం సముద్రుడు ఒక సునామీలా ఎగసి మళ్లీ ద్వారకానగర భూభాగాన్ని తనలో కలుపు కుంటాడు. అలా ద్వారకా నగరం సముద్ర గర్భంలో కి వెళ్ళిపోతుంది.
Why did Lord Krishna's city sink into the sea? What happened that day? What was the cause of the flood? Who witnessed it? Other interesting things for you.. "Dwaraka".. When we hear this name we remember Lord Krishna. This city ruled by Lord Krishna during Mahabharata is now under the sea. The vestiges of those days which give strength to Indian epics are still strong. What happened to this city ruled by Krishna? Why drowned in the sea? Let's find out what happened that day.
What happened that day?: Heavy winds blew before the flood. Earthen vessels started breaking on their own in people's residences. Thinking that these were signs of a great calamity, Lord Krishna ordered everyone to gather and bathe in the holy sea. At Krishna's call, Arjuna, who came to the gate, was told about the impending calamity. He said that in another week, Dwarka will sink into the sea. Dwarka advised people to move to a safe place. After that Lord Krishna took the forest path and gave up his life. With this, Arjuna, Shrikrishna performed the last rites of all the Yadavas including Balaram and loaded the people and wealth of Dwarka into vehicles and moved them to a safe place. As soon as they all crossed the city, the sea became furious. Dwarka flooded the city in a matter of seconds. All this happened before the eyes of the people of Dwaraka and Arjuna.
A great threat has come to such a prestigious city. What is that..?? Everyone hears about Kurukshetra... In the last stage of that war, except Duryodhana, the remaining ninety-nine Kauravas lost their lives. Then when Shri Krishna went to see Gandhari, the mother of the Kauravas, who was grieving over the loss of her children, she was burning with anger. Seeing Lord Krishna, she wanted to save my child's life, but she could have stopped this Kurukshetra war in an instant. But when you asked why you didn't do that, Krishna gave an answer like this.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: