కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట చాలా విషాదకరం
Автор: EYE FOCUS MEDIA
Загружено: 2025-11-01
Просмотров: 10
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట దుర్ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు
శ్రీ సత్యసాయి జిల్లా, పెద్దన్నవారిపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక నుంచి ఈ ఘటనపై మాట్లాడిన సీఎం
అత్యంత బాధాకరమైన ఘటన కాశీబుగ్గలో చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
తుపానులో ముందస్తు ప్రణాళిక ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని.. తొక్కిసలాటలో ఇంతమంది మృతి చెందటం బాధాకరమన్న సీఎం
దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియచేస్తున్నానని వెల్లడి
కాశీబుగ్గ మృతులకు సంతాపంగా రెండు నిముషాల పాటు మౌనం పాటించిన ముఖ్యమంత్రి, ప్రజావేదికకు హాజరైన ప్రజలు
ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఆలయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవటం విచారకమని వెల్లడి
ముందుగానే పోలీసులకు చెప్పి ఉంటే భక్తులను క్యూలైన్లలో నియంత్రించేందుకు అవకాశం ఉండేదని వ్యాఖ్య
ప్రతీ ఒక్కరి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ తరహా చర్యలతో తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్య
ఈ ఘటనకు కారకులైన వారిపై సీరియస్ గా వ్యవహరిస్తామని.. తక్షణం కస్టడీలోకి తీసుకుంటున్నట్టు తెలిపిన సీఎం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: