//7tv //ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి
Автор: 7tv CHANNEL NELLORE
Загружено: 2025-04-20
Просмотров: 33
ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్(అప్స) నెల్లూరు జిల్లా మరియు నియోజకవర్గాల కమిటీల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది
ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా మరియు నియోజకవర్గాల కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు అప్స రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు గారుమరియు మాజీ అధ్యక్షులు సుందరం గారునెల్లూరు జిల్లా అప్స గౌరవ అధ్యక్షులు చాట్ల నరసింహారావు, కర్తం ప్రతాప్ రెడ్డిలు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 40 సంవత్సరాల అప్స బ్రోచర్ను విజయ భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ కు సంబంచిన జీవో బుక్ ను జిల్లా కమిటీకి మరియు నగర కమిటీకి అందించడం జరిగింది. విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహ నిర్మాణానికి ఏర్పాటు, ప్రైవేట్ స్కూల్లో పని చేసే టీచర్లకు ఇళ్ల నిర్మాణాలు వంటి విషయాలను మంత్రివర్యులు పొంగూరు నారాయణ దృష్టికి తీసుకుని వెళ్లి నిర్మాణం అయ్యే విధంగా చూస్తానని తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షులు సుబ్రమణ్య రాజు మాజీ అధ్యక్షులు సుందరం గారు ప్రైవేట్ పాఠశాలల జీవోల గురించి అవగాహన మరియు ప్రైవేట్ స్కూల్స్ సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు
రాష్ట్ర అధ్యక్షులు నెల్లూరు జిల్లా కార్యవర్గాన్ని, నగర కార్యవర్గాన్ని, కావలి కార్యవర్గాన్ని, కొవ్వూరు కార్యవర్గాన్ని, ఉదయగిరి కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు అతని చేతుల మీదుగ సన్మానాన్ని మరియు ప్రశంస పత్రాన్ని అందించారు కర్తం ప్రతాప్ రెడ్డి, చాట్ల నరసింహారావు మాట్లాడుతూ కరస్పాండెంట్ తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఎవరికి ఏ సమస్య వచ్చిన పరిష్కరించే విధంగా చూస్తానని తెలియజేశారు. అధిక సంఖ్యలో కరస్పాండెంట్స్ పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సుబ్బయ్య గారు జిల్లాకార్యవర్గ సభ్యులు నగర కార్యవర్గ సభ్యులు కోవూరు ఉదయగిరి కావలి సభ్యులు పాల్గొన్నారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: