రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అంబ పరమేశ్వరి.ravamma ma intiki amma rajeswari amba parameswari.
Автор: Ckreddy Devotional
Загружено: 2025-11-13
Просмотров: 619
రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరరీ
రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరీ అంబ పరమేశ్వరి
నువ్వు రావాలమ్మా మా ఊరికి
అమ్మ రాజేశ్వరీ అంబ పరమేశ్వరీ
చరణం 1
నీవు స్నానమాడ కృష్ణనది తీరమున్నది
నీవు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి
ఆపైన మందార పువ్వులున్నవి
నీ సేవ కోసమే అవి వేచియూన్నవి
రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరీ అంబ పరమేశ్వరీ
చరణం 2
మాకు ఆకలిస్తే అన్నపూర్ణ వైనావమ్మా
మాకు చదువు నేర్పే సరస్వతి నీవేనమ్మా
బెజవాడ కనక దుర్గా నీవేనమ్మా"2"
శ్రీశైల భ్రమరాంబ నీవేనమ్మ
రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరీ అంబ పరమేశ్వరీ
చరణం 3
మల్లెపూల మాలలల్లి తెచ్చినామమ్మా
నీకు మరుమల్లె దండకట్టి వేసినామమ్మా
గులాబీ పూవ్వులు నీకేనమ్మా
నీ పూజ కోసమే వేచి నాయమ్మా
రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరీ అంబ పరమేశ్వరీ
చరణం 4
నీవు సిరులిచ్చి శ్రీ లక్ష్మి వైనావమ్మ
మా అండ దండ తోడు నీడ నీవేనమ్మా
మమ్మేలు కనకదుర్గ నీవేనమ్మ "2"
బెజవాడ కొండదిగి రావేమమ్మా
రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరీ అంబ పరమేశ్వరీ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: