#Venkatapuram
Автор: Sahasa Yatrikudu
Загружено: 2025-02-17
Просмотров: 2215
పూర్వం #శ్రీశైలానికి నాలుగు వైపుల నుండి నాలుగు దారులు అందుబాటులో ఉండేవి. 1960వ దశకంలో ఘాట్ రోడ్ నిర్మాణం తర్వాత ఈ దారులన్నీ మూతబడినవి. అయితే ఇప్పటికి కూడా ఒక దారి సంవత్సరానికి రెండుసార్లు భక్తుల కోసం ఓపెన్ చేస్తారు.
ఈ దారి సుమారు 50 కిలోమీటర్లు దట్టమైన #నల్లమల అడవిలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. శివరాత్రికి, ఉగాదికి కర్నూలు జిల్లా #ఆత్మకూరు దగ్గర ఉన్న #వెంకటాపురం అనే గ్రామం నుండి ఈ దారి మొదలవుతుంది.
#శివరాత్రికి తెలుగు భక్తులు ఎక్కువ సంఖ్యలో #ఉగాదికి కన్నడ మరాఠా భక్తులు ఎక్కువ సంఖ్యలోనూ ఈ మార్గం కుండా ప్రయాణం చేస్తారు. ఈ దారిలో ప్రయాణం చేసే భక్తుల అవసరాలు తీర్చడానికి దారి మధ్యలో #నాగలూటి #దామర్లకుంట #బైర్లూటి #పెచెరువు మొదలైన ప్రదేశాల్లో ఆహారం బస చేసే ఏర్పాట్లు చేస్తారు. ఎంతో అదృష్టం ఉంటే గాని ఈ శ్రీశైల పాదయాత్ర మనం చేయలేము.
#వెంకటాపురంపాదయాత్రగా ఇది ప్రసిద్ధి చెందింది. #రెడ్డిరాజులు #విజయనగర రాజులు దారి మధ్యలో కట్టిన మెట్లు గోపురాలు విశ్రాంతి మందిరాలను దాటుకుంటూ ఈ ప్రయాణం కొనసాగుతుంది.
1830వ సంవత్సరంలో #ఏనుగుల వీరాస్వామి గారు తన కాశీ యాత్రలో భాగంగా వెంకటాపురం నుండి #శ్రీశైలంయాత్ర కూడా చేశారు.
• #నల్లమలలో కనుమరుగైన మరో నగర రహస్యం, వేయి గ...
• శ్రీశైలం అడవిలో రహస్యమైన ప్రదేశంలో కొప్పుల...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: