Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

#Jwalapuram

Автор: Kengara Mohan

Загружено: 2026-01-16

Просмотров: 144

Описание:

మానవజాతి చరిత్రలో సరికొత్త అధ్యాయం జ్వాలాపురం:

ఉమ్మడి కర్నూలు జిల్లాలో బనగానపల్లె సమీపంలో ఉన్న జ్వాలాపురం గ్రామాన్ని సందర్శించాను. ఈ గ్రామంలో నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒకరు, ఏదో ఒక బృందం, ఏదో ఒక దేశానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు వచ్చిపోతూనే ఉంటారు. 2003 నుంచి 2010 వరకు జరిపిన తవ్వకాల్లో మానవ పుర్రె శకలాలు, ఒక దంతము లభించాయి. హోమో సెపియన్స్ సెపియన్స్ (40,000 సంవత్సరంలో నుండి ఇప్పటివరకు ) జాతికి చెందినవి గానూ గుర్తించారు. లభించిన ఆ పుర్రెలు 20-12 వేల సంవత్సరాల మధ్య కాలానికి చెందినవిగా ఉంటాయని నిర్ధారించారు.

ఇక్కడ ప్రథమ ప్రాచీన శిలాయుగ సంస్కృతికి సంబంధించి చేతి గొడ్డలి కూడా లభించింది. ఇక్కడే సుమారు 35000 సంవత్సరాల నాటి మధ్య శిలాయుగ సంస్కృతికి చెందిన ఆవాసాన్ని కనుగొన్నారు.
ఆఫ్రికా ఖండం నుంచే మనిషి మూలాలు ప్రారంభమయ్యాయని, ఆ ప్రాంతం నుంచే ఆదిమ మానవుడు ప్రపంచం నలుమూలలకు వెళ్లాడని, చార్లెస్ డార్విన్ On the Origin of Species by Means of Natural Selection (1859) అనే సిద్ధాంత గ్రంథంలో పేర్కొన్నారు. కానీ... అంతకుముందే మన రాష్ట్రంలో ఆదిమ మానవుడు జీవించాడనటానికి స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి.

సుమారు 74 వేల ఏళ్ల క్రితమే ఆదిమ మానవుడు ఇక్కడ జీవించినట్లు పరిశోధకులు తేల్చేశారు. వివిధ దేశాలకు చెందిన పరిశోధకులు ఈ ప్రాంతానికి పలు మార్లు వచ్చి చాలాకాలం జ్వాలాపురంలో తవ్వకాలు చేపట్టారు. ఆ తవ్వకాల్లో ఆదిమ మానవుడి ఆనవాళ్లు, వారు వినియోగించిన రాతి పనిముట్లు లభ్యమయ్యాయి. సుమారు 74 వేల ఏళ్ల క్రితం ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో టోబా అనే అగ్ని పర్వతం పేలింది. ఆ పేలుడు ప్రభావం దశాబ్దకాలం పాటు ఈ భూమిపై ఉంది. ఆ పేలుడు వెదజల్లిన లావా భూమండలమంతటా వ్యాప్తి చెందింది. లావా నుంచి వచ్చిన ఆ బూడిద ఒక పొరలా కమ్మేసి సూర్యకాంతి భూమి మీద పడకుండా చేసింది. దాంతో సూర్యరశ్మి భూమి మీద పడే అవకాశం లేకపోవటంతో వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి మంచుయుగం లాంటి పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా మానవ జాతి చాలా వరకు అంతరించింది. కేవలం అతికొద్ది మంది మనుషులు మాత్రమే ఆ ఉపద్రవం నుంచి బతికి బయటపడ్డారని భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది . టోబా అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద మన దేశంలోని పలు ప్రాంతాల్లో సైతం పడింది. ఆ తెల్లటి బూడిద జ్వాలాపురంలో ఇప్పటికీ లభ్యమవుతోంది. ఈ బూడిద పొరల కిందే ఆదిమ మానవుడి అవశేషాలు లభ్యమయ్యాయి.

ఉమ్మడి కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలోని బిల్లసర్గం గుహలు జీవ పరిణామ సిద్ధాంతానికి ఎంతో కీలకమైనవి. భారతీయ పురాచరిత్ర పితామహునిగా పేరుగాంచిన రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే శాస్త్రవేత్త మొదటిసారి ఈ గుహల గురించి రాశారు. ఆయనే స్వయంగా ఈ గుహల్లో తవ్వకాలు జరిపించారు. ఇక్కడ జంతువుల అవశేషాలు లభ్యమయ్యాయి. ఆయన తర్వాత చాలా కాలానికి ఈ గుహల్లో మనిషి జాడ కోసం ఆర్కియాలజిస్ట్ రవి కొరిశెట్టార్ బృందం పరిశోధనలు చేపట్టింది. ఈ క్రమంలోనే స్థానికుల ద్వారా జ్వాలాపురం గురించి ఆయనకు తెలిసింది.

జ్వాలాపురంలో ఆ లావా బూడిద ఉన్నట్లు తెలుసుకున్న రవి కొరిశెట్టార్ ప్రపంచ పరిశోధకుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. ఆయనతో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన మైకేల్ పెట్రాగ్లియా సహా వివిధ దేశాలకు చెందిన మరికొందరు శాస్త్రవేత్తలు 2004 లో ఈ ప్రాంతానికి వచ్చారు. నంద్యాల పట్టణంలో ఉంటూ ప్రతి రోజూ... జ్వాలాపురానికి వెళ్లి స్థానికుల సాయంతో తవ్వకాలు జరిపేవారు. తవ్వకాల్లో పాల్గొన్నవారికి ప్రతి రోజూ కూలీ ఇచ్చేవారు. ఎంతో జాగ్రత్తగా అక్కడ తవ్వకాలు చేశారు. ఏడాదికి పైగా ఇక్కడ పరిశోధనలు జరిపారు. మొత్తంగా ఆధునిక మానవుడి గమనాన్ని, భారత్‌లో పూర్వ రాతియుగ చరిత్రను తిరగరాసే అద్భుతమైన సాక్ష్యాలు ఇక్కడ లభ్యమైనట్లుగా పరిశోధనలు తేల్చాయి.
అక్కడ తవ్వకాల్లో... ఆ బూడిద పొర పైనా, #jwalapuram #mbvk #peddathumbalam #విజయవాడ కిందా మనిషి వాడిన రాతి పనిముట్ల ఆనవాళ్లు కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. దాదాపు 60 వేల ఏళ్ల క్రితం మనిషి ఆఫ్రికా నుంచి భారత్ వచ్చాడని శాస్త్రవేత్తలు అంచనా వేసేవారు. కానీ ఆ అంచనాలకు జ్వాలాపురం సవాలు విసిరింది. శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు 60 వేల ఏళ్లు కాదు... 74 వేల ఏళ్ల క్రితమే మనిషి ఇక్కడ సంచరించాడు అని కొత్త ప్రతిపాదనలను ఈ గ్రామం ప్రపంచం ముందుకు తెచ్చింది. అందుకే పరిశోధకులు ఈ ప్రాంతాన్ని భారతదేశ రాతి యుగ చరిత్ర దిశనే మార్చిన ఆర్కియలాజికల్ సైట్ గా పిలుస్తున్నారు.

జ్వాలాపురం తవ్వకాల్లో ఒక మిడిల్ పాలీ లిథిక్ రాయి దొరికింది. దానికి దగ్గరలో ఎర్లీ పాలీ లిథిక్ రాయి దొరికింది. ఇక జుర్రేరు నది ఒడ్డున మైక్రో లిథిక్ వస్తువులు దొరికాయి. యాగంటి పెయింటెడ్ రాక్ షెల్టర్ల దగ్గరలో నేలపై మైక్రో లిథిక్ పరికరాలు కనిపించాయి. మొత్తం మీద ఆ చుట్టుపక్కల దాదాపు 2 వేల ఎకరాల పరిధిలో పాలీ లిథిక్ నుంచి మెగా లిథిక్ వరకూ చాలా మానవ ఆవాస సాక్ష్యాలు దొరికాయి. తూర్పు ఆఫ్రికాతో సమానమైన సాక్ష్యాలు దొరికాయని పరిశోధకులు చెబుతున్నారు. వాటిని కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని రాబర్ట్ బ్రూస్ ఫూట్ సంగనకల్లు పురావస్తు మ్యూజియంలో భద్రపరిచారు.

జ్వాలాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అగ్నిపర్వతం బూడిద వ్యాపించి ఉంది. సరైన అవగాహన లేకపోవటంతో ఈ బూడిదను స్థానికులు తవ్వి పొరుగు రాష్ట్రాలకు గతంలో విక్రయించారు. దీని ద్వారా సబ్బులు, డిటర్జెండ్ పౌడర్లు
జ్వాలాపురం పరిసర ప్రాంతాల్లో బూడిదను దాదాపు తవ్వేశారు. సుమారు 90 శాతానికి పైగా బూడిదను తవ్వి అమ్ముకున్నారు. ప్రస్తుతం పదిశాతం బూడిద మాత్రమే అందుబాటులో ఉంది. తవ్వేందుకు ఏమీ లేకపోవటంతో ఈ భూములను చదును చేసుకుని వాటిలో పంటలు పండించుకునే ప్రయత్నం ప్రారంభించారు. గతంలో పరిశోధకులు తవ్విన ఆనవాళ్లను రైతులు పూడ్చేస్తున్నారు. ఇలా పూడ్చటం వల్ల భవిష్యత్తులో పరిశోధనలు చేయాలనుకునేవారికి నష్టమేనని నిపుణులు చెబుతున్నారు.

#Jwalapuram

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

#Aksharam-2024 Award Function Maruthi Powrihitam Speech

#Aksharam-2024 Award Function Maruthi Powrihitam Speech

పోగు మీద దూసుకొస్తున్న గిత్త T.BR BULL'S VANIPENTA

పోగు మీద దూసుకొస్తున్న గిత్త T.BR BULL'S VANIPENTA

КУСТО УВИДЕЛ ЧТО СКРЫВАЛИ НА ДНЕ БАЙКАЛА! О ЧЕМ МОЛЧАЛ СССР?

КУСТО УВИДЕЛ ЧТО СКРЫВАЛИ НА ДНЕ БАЙКАЛА! О ЧЕМ МОЛЧАЛ СССР?

Серебро из батареек таблеток

Серебро из батареек таблеток

Первая проверка 26 года. Сюрпризы погоды. Мешок добычи.

Первая проверка 26 года. Сюрпризы погоды. Мешок добычи.

Чем ОПАСЕН МАХ? Разбор приложения специалистом по кибер безопасности

Чем ОПАСЕН МАХ? Разбор приложения специалистом по кибер безопасности

Special Story On Jwalapuram Village || జ్వాలాపురంలో ఆదిమానవుడి ఆనవాళ్లు - బూడిద పొరల కింద అవశేషాలు

Special Story On Jwalapuram Village || జ్వాలాపురంలో ఆదిమానవుడి ఆనవాళ్లు - బూడిద పొరల కింద అవశేషాలు

МОРОЗОВ — Переписал Историю ЧЕЛОВЕЧЕСТВА. Запрещённая Теория, Которую БОЯЛСЯ Сталин

МОРОЗОВ — Переписал Историю ЧЕЛОВЕЧЕСТВА. Запрещённая Теория, Которую БОЯЛСЯ Сталин

Идентификация горных пород и минералов

Идентификация горных пород и минералов

Как сделать МАГНЕЗИАЛЬНЫЙ ЦЕМЕНТ! Полная инструкция!

Как сделать МАГНЕЗИАЛЬНЫЙ ЦЕМЕНТ! Полная инструкция!

#కందుకూరి వీరేశలింగం పంతులు స్వగృహం

#కందుకూరి వీరేశలింగం పంతులు స్వగృహం

Неизвестные маршруты Крыма: Змеиная балка и древние петроглифы

Неизвестные маршруты Крыма: Змеиная балка и древние петроглифы

ЧТО ПИТЬ, Чтобы Быстро Улучшить Кровообращение В Ногах? После 60! Доктор Мясников

ЧТО ПИТЬ, Чтобы Быстро Улучшить Кровообращение В Ногах? После 60! Доктор Мясников

November 26, 2025

November 26, 2025

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసిన స్థలం రవ్వలకొండ | Ravvala konda

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసిన స్థలం రవ్వలకొండ | Ravvala konda

Музыка под утренний кофе — зимний джаз и тепло

Музыка под утренний кофе — зимний джаз и тепло

Холодная зимняя ночь в заброшенной охотничьей хижине - ASMR КЕМПИНГ

Холодная зимняя ночь в заброшенной охотничьей хижине - ASMR КЕМПИНГ

Jwalapuram: భారత దేశ చరిత్రను మలుపు తిప్పిన ఈ ఊరిలో 74 వేల ఏళ్ల కిందట ఏం జరిగిందంటే.. | BBC Telugu

Jwalapuram: భారత దేశ చరిత్రను మలుపు తిప్పిన ఈ ఊరిలో 74 వేల ఏళ్ల కిందట ఏం జరిగిందంటే.. | BBC Telugu

#Book Brahma Literature Festival-2024 at Bangalore

#Book Brahma Literature Festival-2024 at Bangalore

Медная антенна, которая утроила урожай: забытый запретный эксперимент 1926 года

Медная антенна, которая утроила урожай: забытый запретный эксперимент 1926 года

© 2025 dtub. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: infodtube@gmail.com