చెట్లకు కట్టేసి కొడతామని-గతంలోనే హెచ్చరించా|Adivasi Kolams Protest Itda|MLA Vedma Bojjupatel
Автор: The Thukaram Channel
Загружено: 2025-11-17
Просмотров: 13495
UTNOOR ITDA|MLA Vedma Bojjupatel Khanapur Constituency in Adilabad Adivasi Community Rights Kolams Seva sangah President Kodapa Senerao ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్‌తో కలిసి ధర్నా వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతాలలో నివాసముంటున్న ఆదివాసులకు ఇబ్బందులకు గురి చేయడం, అభివృద్ధిని అడ్డుకుంటే చెట్లకు కట్టేసి కొడతామని గతంలోనే అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని అన్నారు. పీవీటీజీల సమస్యలపై సీఎంతో పాటు సంబంధిత అటవీ శాఖ మంత్రితో మాట్లాడం జరిగిందన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తనతో పాటు ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకు రావాలన్నారు. పీవీటీజీల ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.75 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ. 1.75 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి ఆదివాసుల సమస్యలపై అధికారులతో గొడవ పడుతునని పేర్కొన్నారు. ఎవరైనా అధికారులు తన దృష్టికి సమస్యను తీసుకురాకుండా బలవంతంగా ఆదివాసులను అటవీ ప్రాంతం నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. ఆదివాసుల ఒపిక నశిస్తే వారిని ఆపే తరం ఎవరిది కదన్నారు. పీవీటీజీల సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరం అయ్యేలా కృషి చేస్తానని, సమస్య పరిష్కరం కాకపోతే పీవీటీజీలు తన ఇంటి ఎదుట వచ్చి ధర్నా చేయవచ్చాన్నారు. జిల్లా స్థాయి అధికారులు ఏసీలలో ఉంటూ కింది స్థాయి అధికారులను బాధ్యులు చేయడం తగదన్నారు. ఇదిలా ఉండగా వివిధ సంఘాల నాయకులు సంపూర్ణ మద్ధతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్ర రాజు, గౌరవ అధ్యక్షుడు టేకం లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు మడావి గోవింద్ రావ్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆత్రం జలపత్‌రావ్, టేకం గణేష్, మడావి కిషన్, మహిళ సంఘం నాయకురాలు నాగుబాయి, లక్ష్మీబాయి, రాజ్‌గొండ్ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషం రావ్, ఆదివాసీ సంఘాల నాయకులు టేకం వసంత్‌రావ్, కుర్సేంగే తానాజీ, పుర్క బాపురావ్, పెందూర్ పుష్పరాణి, రితేష్ రాథోడ్, సెడ్మకి ఆనంద్‌రావ్, కొడప రాము, కుమ్ర జలపత్‌రావ్, తదితరులు పాల్గొన్నారు.#adivasi#kolam#vedmabhojjupatel#adilabadnews#telangananews#tribalindia#tribalindia#adilabad
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: