కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో చోరీ నిందితులు అరెస్ట్ | Kasibugga Venkateswara Swamy Temple ||city99
Автор: City99
Загружено: 2026-01-20
Просмотров: 63
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పలాస కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత వారం రోజులు క్రిందట చోరీ జరిగింది. పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ఆలయానికి సంబంధించి 15 కేజీలు వెండి ఆరు న్నార తులాల బంగారం 80000 నగదు స్వాధీనం చేసుకున్నామని ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, దేవాలయంలో వెంకటేశ్వర స్వామి ఆభరణాలను దొంగలించారని పోలీస్ ప్రత్యేక బృందాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి హిరమండలం ప్రాంతంలో వీరిని పట్టుకోవడం జరిగిందని ఐదుగురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామని తెలిపారు. దేవాలయాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అందువల్ల పూర్తిస్థాయిలో సీసీ కవరేజ్ దేవాలయాల ఉంచాలని తెలిపారు, విలువైన వస్తువులను కాపాడుకునేందుకు దేవాలయ సిబ్బంది నిరంత పర్యవేక్షణ చేయాలని తెలిపారు. దొంగతనం చేసిన నిందితులు గతంలో పలు దొంగతనాల్లో శిక్ష అనుభవించారని ఈ మధ్యకాలంలో జైలు నుంచి విడుదలై మళ్లీ దొంగతనాన్ని పాల్పడ్డారని వీరుపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. దొంగలించబడిన మొత్తం సొమ్ము 40 లక్షల వరకు ఉంటుందని పూర్తిస్థాయిలో రికవరీ చేయగలమని తెలిపారు.
/ @city9917
For more updates and Interesting Video Please Subscribe us.
#srikakulam #apbreakingnews #city99
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: