అయ్యప్ప
Автор: sriharihara creations
Загружено: 2025-10-29
Просмотров: 99
బాలస్వామిని బంగారు అయ్యప్ప
కన్నె స్వామినీ కరుణించూ అయ్యప్ప
మాల వేసినా మనసార అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్పా ll
నా చిన్ని చేతులు చప్పట్లు కొడితిని
నా చిన్ని గొంతులో కీర్తనలు చేసినా
నా చిన్ని మనసుతో నీ స్మరణ చేసినా
తెలిసితెలియని తనముతో నిన్నే తెలుసుకుంటుని
నా ఆటలో నీవే నా స్వామి అయ్యప్ప
నా పాటలో నీవే నా స్వామి అయ్యప్ప
నా మాటలో నీవే స్వామి శరణం అయ్యప్ప
నా చేతలో నీవే స్వామి శరణం అయ్యప్ప
నాలో నువ్వే ఉన్నావు అయ్యప్ప
నీలో నేనై ఉంటాను అయ్యప్ప
నన్ను నడిపించేది నువ్వే స్వామి అయ్యప్ప
నన్ను నీదరి చేర్చేది దైవము అయ్యప్ప
ఈ చిన్ని తనములో నీ మాల వేసినా
నాకెంత భాగ్యము ఏ జన్మ పుణ్యమో
ఇరుముడి కట్టి శబరి మలెక్కి
నెయ్యాభిషేకం చేస్తాను అయ్యప్ప ll...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: