Hari Hari Nabaduku - Annamayya Sankeerthana (హరిహరి నాబదుకు - అన్నమయ్య సంకీర్తన) lyrics
Автор: Bijjam Brothers
Загружено: 2023-04-14
Просмотров: 187656
హరిహరి నాబదుకు - అన్నమయ్య సంకీర్తన (Hari Hari Nabaduku - Annamayya Sankeerthana)
Singer - Pavan Charan garu; Music Composer - Saluri Vasu Rao garu
Ragam - Revathi
Lyrics -
హరిహరి నాబదుకు ఆశ్చర్యమాయ నాకు
శరణంటి నిన్నిటికి సెలవుగా నీకును
వున్నతి జలధిఁ గలవుప్పెల్లాఁ దింటిఁగాని
యెన్నిక సుజ్ఞానమింతా నేఱఁగనైతి
దిన్నగా భూమి వేరుగ దేహములెత్తితిఁగాని
పన్నిన నాభోగకాంక్షఁ బాయఁగలేనైతిని
నాలికఁ బేలితిఁ గాని నానాభాషలెల్లా
తాలిమి హరినామము దడవనైతి
నాలిసంసారము బ్రహ్మనాఁటనుండిఁ జేసేఁగాని
మేలిమి మోక్షముతోవ మెలఁగఁగనైతిని
వూరకే దినదినాలయుగాలు దొబ్బితిఁగాని
నేరిచి వివేకము నిలుపనైతి
మేరతో శ్రీవేంకటేశ మీరే దయఁజూడఁగాను
దారదప్ప కిట్టే మీదాఁసుడ నైతిని
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: