కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ నోటిఫై చేయడానికి వ్యతిరేకిస్తూ CITU ఆధ్వర్యంలో నిరసన
Автор: KHADRI CABLE NEWS
Загружено: 2025-11-25
Просмотров: 103
*కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఆర్ అండ్ బి బంగ్లా నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసారు*. *ఈ ర్యాలీలో పాల్గొన్న సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసారు*. *అనంతరం నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేసి, నేడు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం పాత చట్టాలలో ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా రద్దు చేసి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చిందని విమర్శించారు*.*కార్మికులకు కనీస వేతనం అడిగే హక్కు*,
*సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేయడం మన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమే అన్నారు*. *కార్మికుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని చెబుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రభుత్వ శాఖలలో, పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు*.*ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల పాలిట శాపంగా ఉన్న లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు*.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రాంభూపాల్ మాట్లాడుతూ అంగనవాడీలు 42 రోజులు పాటు సమ్మె చేస్తుంటే శిబిరాలకు వచ్చి మద్దతు తెలిపినటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ గార్లు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా అంగన్వాడీలకు జీతాలు ఎందుకు పెంచలేదో చెప్పాలన్నారు. తెలుగుదేశం కూటమి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎల్ నరసింహులు, నాయకులు లక్ష్మీనారాయణ, సాంబశివ, బాబ్జాన్, జగన్మోహన్, రామ్మోహన్, ముస్తాక్, రాజారెడ్డి, గోవిందు, ఓడిసి రమణ, నాగరాజు, నాగిరెడ్డి వేమన్న, శివన్న, శంకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అంగన్వాడి నాయకురాళ్లు సుజాత, ప్రమీలమ్మ, రంగమ్మ, రాధ, మోక్షప్రియ, లక్ష్మీదేవి, చంద్రకళ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు అంజినమ్మ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: