Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Ep: 07 - Hamsadhwani Raaga (హంసధ్వని రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas on Harmonium |

Автор: Bhakthi Geethanjali

Загружено: 2020-12-10

Просмотров: 44049

Описание:

హంసధ్వని రాగం:

భక్తి గీతాంజలి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న సంగీత అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనములు. హార్మోనియం మరియు కీ బోర్డు పై సంగీత శిక్షణలో భాగంగా రెండవ దశ అయిన రాగవాణి లో ఈనాటి రాగం హంసధ్వని.

హంసధ్వని అంటే హంస యొక్క అరుపు నుండి వచ్చే శబ్దము అని అర్థం.

ఈ రాగం ముత్తుస్వామి దీక్షితార్ గారి తండ్రిగారైన రామస్వామి దీక్షితార్ గారి చే కనుగొనబడినది.

కర్ణాటక సంగీతంలో పుట్టి, హిందుస్థానీ సంగీతంలోని కి కూడా గ్రహించబడి ఉన్న రాగం. ఇది 29వ మేళకర్త రాగమైన ధీరశంకరాభరణం రాగమునకు జన్యము. కళ్యాణి రాగం యొక్క ఛాయలు కూడా కలిగియున్న రాగము. ఉపాంగ రాగము, త్రిస్థాయి రాగము.

ఈ రాగం ఒక ప్రకాశవంతమైన ప్రారంభమునకు ఉపయోగించే రాగం. కాబట్టి కచేరీలు, సంగీత విభావరులు, భజనల ప్రారంభములో ఆలపించ బడుతున్న రాగం. వినాయకుని ప్రార్థనలలో, కృతులలో విరివిగా ఉపయోగింపబడిన రాగము.

ఆరోహణము, అవరోహణ లు చూద్దాం.
ఆ: స రి2 గ3 ప ని3 స
అ: స ని3 ప గ3 రి2 స

స్వరములు:
షడ్జమం, చతుశృతి రిషభము, అంతర గాంధారము, పంచమం, కాకలి నిషాదము, పై షడ్జమము.

రాగఛ్ఛాయ కోసం స్వర ప్రయోగం:

నిరిపగనిపగరిగపనీనీ,
నిరిగా, గపనీ, పనిరీ
నిరిగరి నిరిని పనిప గా పరీ గరినిరిసా

జంటలు:
సస రిరి గగ పప నిని సస నిని పప గగ రిరి సస

దాటులు:
నిరి సగ రిప గని పస నిరి సగరిస నిరిసా

పద్యం:

కందము:
లంబోదర! గణపతి! శశి
బింబాధరి తనయ, నిన్ను ప్రేమగ పిలువన్,
సంబరమున దాసులనని
శంబును గాచెదవు సిధ్ధ చారణ వినుతా.

కృతులు, కీర్తనలు, పాటలు:

1.వాతాపి గణ పతింభజే ముత్తు స్వామి దీక్షితార్

2.వినాయకా నిను వినా -ఈ వీ రామకృష్ణ భాగవతార్.

3.చాలదా హరినామ - అన్నమాచార్య

4.దేవా నమో దేవా - అన్నమాచార్య

5.శ్రీ రఘురాం జయరఘు రాం - శాంతి నివాసం

6.స్వాగతం సుస్వాగతం - శ్రీకృష్ణ పాండవీయం

7.తరలి రాద తనే వసంతం - రుద్రవీణ

8.నిను కనుగొని - షిరిడి సాయి భక్తి గీతం

9.శుభములు గూర్చు - రమేష్ బాబు రచించిన భక్తి గీతం

10.శ్రీ గణనాయక వందనము - భక్తి గీతం

11.నడకా హంసధ్వని రాగమా - బంగారు కానుక

12.గోపాల నను పాలింప రారా - మనుషుల్లో దేవుడు

13.మౌనం గానం మధురం - మయూరి

14.శ్రీ రంగరంగ నాథుని - మహానది

15.మరుమల్లెల్లో ఈ జగమంతా - అమృత

16.తెల్లతెల్ల వారే వెలుగు రేఖలా - గీత గోవిందం

రసజ్ఞులైన మీ అందరికీ నా విన్నపం.
సంగీతం సాగరం తో పోల్చ బడినది. ఎవరి జ్ఞానం ఎంత ఉంటే అంత వారికి అర్థమవుతుంది. నాకు గురువుల వలన పెద్దల వలన తెలిసిన విషయాలను మాత్రమే తెలియజేస్తున్నాను.
ముఖ్యముగా సంగీతం నేర్చుకుంటున్న వారికి మాత్రమే నా వీడియోలు ఉపయోగపడతాయి. విద్వాంసులైన వారికోసం ఉద్దేశించిన వీడియోలు కావు. ఇందులో ఏమైనా నా పొరపాట్లు దొర్లితే అది నాకు సంబంధించిన విషయంగానే పరిగణించాలని, ఆ దోషం సంగీతానిది గాని, మా గురువులది గాని కాదని గ్రహించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ .... ఈ సంగీతము క్లాసులు మీకు మీ సంగీత మిత్రులకు ఉపయోగపడతాయని భావిస్తే లైక్ చేసి, షేర్ చేయండి. మా వీడియోలు తప్పనిసరిగా మీకు అందాలంటే, మన భక్తి గీతాంజలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.

ధన్యవాదములు.

మీ రమేష్ బాబు సీపాన
+91 9949124221

Support Us:
Link to Donate: https://bit.ly/36bKvLH

Connect With Us:
Telegram: https://t.me/Bhakthigeethanjali
Twitter:   / bhakthigeethanj  
Facebook:   / bhakthigeeth.  .
Instagram:   / bhakthigeet.  .
E-Mail: [email protected]

Ep: 07 - Hamsadhwani Raaga (హంసధ్వని రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas on Harmonium |

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Ep: 08 - Kalyani Raaga (కళ్యాణి, మేచ కళ్యాణి రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas |

Ep: 08 - Kalyani Raaga (కళ్యాణి, మేచ కళ్యాణి రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas |

Ep: 10 - Hindolam Raaga (హిందోళం రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas |

Ep: 10 - Hindolam Raaga (హిందోళం రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas |

What is the uses of symbols  in notation నొటేషన్ లో గురుతులను ఎందుకు వాడుతారు

What is the uses of symbols in notation నొటేషన్ లో గురుతులను ఎందుకు వాడుతారు

Dr.K J Yesudas-Amazing rendering of the Raga HAMSADHWANI.

Dr.K J Yesudas-Amazing rendering of the Raga HAMSADHWANI.

శుద్ధ దన్యాసి రాగము యొక్క నెంబర్లు

శుద్ధ దన్యాసి రాగము యొక్క నెంబర్లు

హంసధ్వని || రాగ విశ్లేషణ || రాగ ఆలాపన || పద్యం , సినిమా పాటలు || HAMSADHWANI || ON HARMONIUM

హంసధ్వని || రాగ విశ్లేషణ || రాగ ఆలాపన || పద్యం , సినిమా పాటలు || HAMSADHWANI || ON HARMONIUM

For melodious voice | what exactly sincerely to follow precautions food and tips explains here watch

For melodious voice | what exactly sincerely to follow precautions food and tips explains here watch

కళా తపస్వి కె. విశ్వనాధ్ గారు, కేవీ మహదేవన్ గారి కలయికలో వచ్చిన అందమైన పాట |Muthyalappa vanarasa

కళా తపస్వి కె. విశ్వనాధ్ గారు, కేవీ మహదేవన్ గారి కలయికలో వచ్చిన అందమైన పాట |Muthyalappa vanarasa

14. మోహన రాగం || వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల

14. మోహన రాగం || వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల

నాగిని మ్యూజిక్, 18 రకాలు, భజన విధానం.

నాగిని మ్యూజిక్, 18 రకాలు, భజన విధానం.

Ep: 09 - Mohana Raaga (మోహన రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas |

Ep: 09 - Mohana Raaga (మోహన రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas |

Sivaranjani raga aalapana & how to use this type of raga complete details in Telugu language

Sivaranjani raga aalapana & how to use this type of raga complete details in Telugu language

మోహన రాగము మరియు శివరంజని రాగం ఆ రెండు రాగాల మధ్యన ఉన్న వ్యత్యాసం తెలుసుకుందాం #lets #observe#change

మోహన రాగము మరియు శివరంజని రాగం ఆ రెండు రాగాల మధ్యన ఉన్న వ్యత్యాసం తెలుసుకుందాం #lets #observe#change

Tribute to ' melody king ' O. P Nayyar garu || జీవితాంతం స్మరించుకొనే పాటల్ని ఇచ్చారు 🙏 | Harmonium

Tribute to ' melody king ' O. P Nayyar garu || జీవితాంతం స్మరించుకొనే పాటల్ని ఇచ్చారు 🙏 | Harmonium

Kafi Ragam || కాపి రాగం || పద్యం , సినిమా పాటలు  || రాగ విశ్లేషణ  || రాగ ఆలాపన

Kafi Ragam || కాపి రాగం || పద్యం , సినిమా పాటలు || రాగ విశ్లేషణ || రాగ ఆలాపన

16. హిందోళం || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల

16. హిందోళం || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల

neelakandhara deva tutorial video on keyboard by Sreekaanth Ch part 1

neelakandhara deva tutorial video on keyboard by Sreekaanth Ch part 1

పియానో గాని హార్మోనియం గాని మూడో కాలం సాధన చేస్తే వాయించడం సులభం అవుతుంది || now || play || piono ||

పియానో గాని హార్మోనియం గాని మూడో కాలం సాధన చేస్తే వాయించడం సులభం అవుతుంది || now || play || piono ||

this two ragas helps to learn all ragas॥singing tips॥carnatic music lesson for beginners in telugu

this two ragas helps to learn all ragas॥singing tips॥carnatic music lesson for beginners in telugu

అన్ని సంగీతాల వారు ఉపయోగించే అభేరి రాగ ఆలాపనను హార్మోనియం లో నేర్చుకుందాం//గంగాధర్ మాస్టర్ //👌👌👌//

అన్ని సంగీతాల వారు ఉపయోగించే అభేరి రాగ ఆలాపనను హార్మోనియం లో నేర్చుకుందాం//గంగాధర్ మాస్టర్ //👌👌👌//

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]