ఓడలరేవు BVC లో పండుగలా గ్రాడ్యుయేషన్ డే ఉత్సవం...
Автор: mojo7 news
Загружено: 2025-08-11
Просмотров: 102
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తొలి ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలగా గుర్తింపు పొంది అటానమస్ హోదా కలిగిన ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే, అచీవర్స్ డే ఘనంగా నిర్వహించారు.. 2021- 2025 విద్యాసంవత్సరాలకు గాను బీటెక్ విద్యను అభ్యసించి ఉత్తీర్ణత సాధించిన 632 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా బీటెక్ డిగ్రీ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జేఎన్‌టీయూ కాకినాడ అకడమిక్ డైరెక్టర్, ప్లేస్‌మెంట్ అధికారి డాక్టర్ ఎం హెచ్ ఎం కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. బీవీసీ ప్రాంగణం అంతా బీటెక్ పట్టాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లితండ్రలు కొలాహలంతో నిండిపోయింది.. తమ పిల్లలు గ్యాడ్యుయేట్‌గా సాధించిన విజయాన్ని చూసుకున్న తల్లితండ్రలు మురిసిపోయారు. కాన్పిరెన్స్ హాలులో బీవీసీ విద్యాసంస్థల కరస్పాండెంట్ బోనం కనకయ్య అధ్యక్షత జరిగిన పట్టాల ప్రధాన కార్యక్రమంలో జేఎన్‌టీయూకే అకడమిక్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్, మరో అతిధి హైదరాబాద్ కు చెందిన ఫౌండర్ అండ్ ఈడీ ఆఫ్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఛైర్మన్ డాక్టర్ రమేష్ కన్నెగంటి, బీవీసీ కళాశాలల చైర్మన్ బోనం కృష్ణ సతీష్ , వైస్ చైర్మన్ డాక్టర్ బోనం కనకదుర్గ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. సాంకితిక విద్యలో ఎప్పటికప్పడు తమను తాము నవీకరించుకుంటూ సమపార్జించిన విజ్ఞానాన్ని సమాజాభివృద్ధికి ఉపయోగపడేలా ప్రతీ విద్యార్థి కృషిచేయాలని ముఖ్యఅతిధి కృష్ణప్రసాద్ అన్నారు.. కరస్పాండెంట్ కనకయ్య మాట్లాడుతూ తమ తండ్రి, బీవసీ సంస్థల ఫౌండర్ దివంగత బోనం వెంకటచలమయ్య ఆశాయాలకు అనుగుణంగా ఉన్నత విలువలు, ఆధునిక విద్యాభోధనతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు .
చైర్మన్ కృష్ణ సతీష్ , వైస్ చైర్మన్ డాక్టర్ బోనం కనకదుర్గ మాట్లాడుతూ అత్యధిక ఉత్తీర్ణతశాతంతో బీవీసీ విద్యార్థలు తమ ప్రత్యేకతను చాటారని, బీటెక్ అనంతరం ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ కల్పించడం ద్వరా అనేక మంది నేరుగా ఉద్యోగ అవకాశాలు దక్కించుకున్నారన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.మహేశ్వర్ ,వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ.ప్రవీణ్ మాట్లాడుతూ సాంకేతిక విద్యతోపాటు మానవ విలువలు నేర్పిస్తూ వినూత్న విధానాలను ప్రవేశపెట్టి పోటీ ప్రపంచంలో తమను తాము నిరూపించుకునేలా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం బీవీసీలో చదివి మల్టిలెవెల్ కంపెనీలలో ఉద్యోగాలను పొందిన 500 మందికి పైగా విద్యార్థలును వారి తల్లిదండ్రులను అభినందించే ఎచీవర్స్ డేను నిర్వహించారు. అమెరికాకు చెందిన సైవెన్ డాట్ ఐఎన్‌సీ టెక్నాలజీ ఫౌండర్, సీఈవో చందు శ్రీనివాసరావు అచీవర్స్ డేను పురస్కరించుకుని విద్యార్థులతో మాట్లాడారు. సాంకేతిక రంగంలోనే కాదు అది ఏ రంగమైనా ఎప్పటికప్పడు మనల్ని కాలానుగుణంగా మనం నవీకరించుకుంటూ పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను, తల్లితండ్రలును అభినందించారు.
ఈ కార్యక్రమాలలో గవర్నింగ్ బాడీ మెంబర్ బోనం కృష్ణ ,కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ బి శ్రీనివాస్ , త్రిబుల్ ఐసీ ఆఫీసర్ డాక్టర్ కే రాజశేఖర్, ఏవో ఏ వై ఆర్ వి ప్రసాద్, బీవీసీఐటీఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ జేవీజీ రామారావు, బీవీసీఆర్ ప్రిన్సిపల్ డాక్టర్ టీవీ జనార్ధనరావు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: