అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా |Annapurna Devi archinthunamma|
Автор: Mangala neerajanam
Загружено: 2025-04-03
Просмотров: 3686
పాట లిరిక్స్ 👇🏻👇🏻
#mangalaharati
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా |2|
విశ్వకనాథుడే విచ్చేయునంట
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట |2|
నా తనువు నో తల్లి నీ సేవ కొరకు
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు |2|
నా ఒడలి అచలాంశ నీ పురము జేరి
నీ పాదముద్రతో నెగడాలి తల్లి |2|
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి
నీ పాద పదాలు కడగాలి తల్లి |2|
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి |2|
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా తనువు మరుదంశ నీ గుడికి చేరి
నీ చూపు కొసలలో విసరాలి తల్లి |2|
నా తనువు గగనాంశ నీ మదికి జేరి
నీ నామ గానాలు మోయాలి తల్లి |2|
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
విశ్వకనాథుడే విచ్చేయునంట
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: