అశ్వథామ నారాయణ స్వామి టెంపుల్(తిరణాల్లు ) || పెద్ద పప్పూరు || ఆంధ్రప్రదేశ్
Автор: NIDHYANA VLOGS
Загружено: 2025-02-09
Просмотров: 97
అశ్వథామ నారాయణ స్వామి టెంపుల్
పెద్దపప్పూరు,మండలంలోని చిన్న పప్పూరు సమీపంలో వెలసిన అశ్వత్థ నారాయణస్వామి, శ్రీ చక్ర స్థాపిత భీమలింగేశ్వరస్వామివారి తిరుణాల ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏటా మాఘమాసంలో స్వామివారి తిరుణా లను వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. తాడిపత్రి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నా నది ఒడ్డున ఉంది.
శ్రీచక్ర భీమలింగేశ్వరస్వామి
స్థల పురాణం
పూర్వం కంచి నుంచి శింగరభట్టు అనే మునీశ్వరుడు శంఖం, చక్రం, గద, అభయహస్తంతో కూడిన శ్రీ విష్ణుమూర్తి దర్శనార్థం ఇక్కడకు వచ్చాడని స్థలపురాణం చెబుతోంది. ఆ మహారుషి పరదరాజులస్వా మిని ప్రసన్నం చేసుకొనేందుకు 12సంవత్సరాలు స్వామివారికి సేవ చేశారు. ఇదే సమయంలో రావణ సంహారం అనంతరం శ్రీరామచం ద్రుడు ఈ క్షేత్రానికి సమీపంలో ఉన్న పెద్దపప్పూరు రామకోటిలో నివ సించేవాడని స్థలపురాణం చెబుతోంది. రావణుడు బ్రాహ్మణుడు కావడంతో బ్రాహ్మణ హత్యా పాతకమును భరించలేని శ్రీరాముడు అశ్వత క్షేత్రంలో ఉన్న శింగరభట్టును కలిసి జరిగిన విషయాన్ని తెలిపారు. దీనికి గాను శింగరభట్లు మహర్షి నీ పాపమును నేను స్వీకరిస్తాను అని. చెప్పాడు. తదనంతరం లక్ష్మీ సమేత విష్ణుమూర్తి ప్రసన్నం కోసం తపస్సు చేశాడు. మహారుషి శింగరభట్టుకు స్వప్నంలో స్వామివారు. సాక్షాత్కరించారు. ఈ సందర్భంగా స్వామివారు ఇక్కడ స్నానం ఆచరించిన భక్తులకు బ్రాహ్మణహత్యాపాతకము ఉండదని, రావి, వేపచెట్టు చుట్టూ తిరిగి ప్రత్యేక పూజలు చేసిన వారికి కోరిన కోర్కెలు నెరవేరు తాయని చెప్పాడు. అనంతరం నదిలో విగ్రహ రూపంలో దర్శనమిస్తా నని స్వామివారు శింగరభట్టుకు తెలియజేశారు. నీవు కూడా విగ్రహ రూపంలో నా పక్కనే కొలువు ఉంటావని, నీ తర్వాతే భక్తులు నన్నుదర్శించుకుంటారని చెప్పి అంతర్ధానమయ్యారని పురాణం చెబుతోంది.
వేములవాడ భీమకని ప్రతిష్ఠించిన భీమలింగేశ్వరుడు
శ్రీ అశ్వత్థ నారాయణస్వామి క్షేత్రంలోనే స్వామివారికి అభి ముఖంగా శ్రీ చక్రస్థాపిత భీమలింగేశ్వరున్ని వేములవాడ. భీమకవి ప్రతిష్ఠించాడు. ముందుగా స్వామివారి లింగం కిందిలాగాన శ్రీ చక్రాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతి ష్టించారని ప్రతీతి. ఎక్కడాలేనివిధంగా శివుని దర్శనం కోసం వచ్చిన భక్తులకు విష్ణుమూర్తి దర్శనం కావడం, విష్ణుమూర్తి దర్శనం కోసం వచ్చిన భక్తులకు శివయ్య దర్శనం కావడం ఇక్కడ ఆలయ విశేషం. దీంతో ఆలయాన్ని హరిహరుల వెలసిన క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.
ప్రతి ఏటా మాఘమాసంలో తిరుణాల
ప్రతి ఏటా ఫిబ్రవరిలో వచ్చే మాఘమాసంలో అశ్వత్వం తిరుణాల వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా అశ్వత్థ నారాయణస్వామి సన్నిధిలోని ఆశ్వత కట్ట వద్ద వెలసిన నారాయణుడికి, శింగరభట్టు మహర్షికి, వినాయకుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అనంతరం అభిముఖంగా వెలసిన భీమలింగేశ్వరున్ని భక్తులు దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఏడాది నాలుగువారాలపాటు తిరుణాల జరగ మంది. మూడో వారంలో భక్తులు వేలాదిగా తరలివస్తారు.
ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు..
ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆశ్వత క్షేత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. స్వామి వారు కోరిన కోర్కెలు తీరుస్తారని ఇక్కడి నదిలో పుణ్యస్నాం చేసి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచే శారు.
Theertha Yatra is a journey across the sacred stretches of india. A travel guide to pilgrimage centers dotting all over the land stretching from Amarnath in the North to Madurai in the South, Puri in the East to Dwaraka in the West one program showcasing it all...
#aptourism #andhrapradesh #rayalaseema #aswathama #god #temple #divine #entertainment #ytshorts #trending #viral #remix #music #railway
#arunachalam #giripradakshina #shiva #tiruvanamalai #tamil #templesofindia #temple #southindian #arunachalashiva
#temple ##latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: