కోరుకొండలో ఘనంగా రామసేన కార్యాలయం ప్రారంభం
Автор: MDV channel
Загружено: 2025-11-28
Просмотров: 1
కోరుకొండలో ఘనంగా రామసేన కార్యాలయం ప్రారంభం.
రామసేన సేవా కార్యక్రమాలు ప్రజలకు మరింత విస్తృతం చేయడానికి కోరుకొండలో విశ్వహిందూ ధర్మపరిరక్షణ, రామసేన కార్యాలయాన్ని రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు నాయకులు, కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కోరుకొండ ప్రాంతం ఎన్నో ప్రసిద్ధి, విశిష్టమైన దేవాలయాలకు నిలయమన్నారు. రామసేన సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, పేద ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం కోరుకొండ గ్రామంలో ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించడం జరిగిందన్నారు. రామసేన సంస్థను స్థాపించి గోకవరం గ్రామం నుండి గత మూడు సంవత్సరాల నుంచి ఎన్నో విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
కోరుకొండ మండలంతో పాటు సీతానగరం రాజానగరం, రాజమండ్రి, పలు దూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ వద్దకు వస్తూ, పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అటువంటి వారి సౌలభ్యం కోసం కోరుకొండలో కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. తమ సేవా కార్యక్రమాల కోసం నియోజవర్గం ప్రజలు గోకవరం రావాల్సిన పనిలేదని, కోరుకొండ కార్యాలయం నుంచి సేవలు అందించడం జరుగుతుందన్నారు.
అధిష్టానం ఆదేశిస్తే భారతీయ జనతా పార్టీ కార్యాలయంగా మార్చడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. కోరుకొండ ప్రాంతంలో ఉన్న బీజేపీ నాయకులతో కలిసి పనిచేస్తూ, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: