ఏలూరు తూర్పు వీధి అమ్మవార్ల ఘటాలకు జరిగిన ప్రత్యేక పూజలు | Eluru Jathara 2025-20206
Автор: Eluru Toorpuveedhi Jathara
Загружено: 2025-12-28
Просмотров: 1068
ఏలూరు/దెందులూరు 28.12.2025
"ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ జాతర సంబరాల్లో భాగంగా జాతర కమిటీ కన్వీనర్ వంకనేని భాను ప్రకాష్ గారి ఇంటి వద్ద అమ్మవార్ల ఘటాలకు జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు కుటుంబసమేతంగా పాల్గొని అమ్మవారి ఘటాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు..
శతాబ్ద కాలం పైగా ఏలూరు పురప్రజలచే ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న తూర్పు వీధి గంగానమ్మ జాతర 2025-26 కార్యక్రమాలు జాతర కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా, ఎంతో శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఎంతో అభినందనీయమని, అమ్మవారు అటు ఏలూరు ఇటు దెందులూరు నియోజకవర్గం చెందిన ప్రజలను ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా, ఆపదల్లో చిక్కుకోకుండా అన్ని విధాల ఆనందంగా జీవించేలా కాచి కాపాడాలని కోరుతూ భక్తిశ్రద్ధలతో శ్రీ గంగానమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ శ్రీ పోతురాజు బాబులకు పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు..
ఈ సందర్భంగా జాతర కమిటీ కన్వీనర్ శ్రీ వంకినేని భాను ప్రకాష్ గారి ఇంటి వద్ద కొలువుదీరిన తూర్పువీధి శ్రీ గంగానమ్మ అమ్మవార్ల జాతర ఘటాలను దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారితో పాటు , ఏలూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ , ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు , ఏలూరు జిల్లా పోలీస్ అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు గారు, ఏలూరు జిల్లా బిజెపి అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు, సహా పలువురు ప్రజాప్రతినిధులు దెందులూరు నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు పాల్గొనీ అమ్మవార్ల ఘట్టాలను దర్శించుకున్నారు.. అనంతరం జాతర కమిటీ కన్వీనర్ వంకినేని భాను ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ విందు కార్యక్రమంలో అందరూ కలిసి సహపంక్తి భోజనాన్ని స్వీకరించారు..
---------
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: