Bhimavaram Famous Sitayya Gari Palav | Kodikura | సీతయ్య గారి పలావ్ | bhimavaram | Food Book
Автор: Food Book
Загружено: 2025-01-20
Просмотров: 120530
ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామం నుండి చదువుకునేందుకు భీమవరం వచ్చిన సీతయ్య గారు అనివార్య కారణాల వలన విద్యకు దూరమయ్యారు.ఆ ప్రతికూల పరిస్థితి జీవితంలో ఉన్నతిని చేకూర్చుకోవాలన్న వారి సంకల్పాన్ని నిరాశ పరచలేదు.
విద్యాకు చేరువకాకపోయిన తనకు ఉన్న సామర్థ్యాలను ఉపయోగించి జీవితాన్ని కొత్తగా మలచుకోవాలనుకున్నారు.
ఆత్మవిశ్వాసంతో నలుగురికి ఉపయుక్తమైన పని ఏదైనా చేయాలని, ముఖ్యంగా తనకు తెలిసిన వంటకాలను ఉపయోగించి జీవనోపాధి పొందాలని నిర్ణయించుకున్నారు. తన వంటకానికి తగిన మెరుగులు జోడించి, భీమవరం ప్రజల అభిరుచిని అర్థం చేసుకుని పలావ్ తయారీలో నైపుణ్యం సాధించారు. మొదట్లో ఒక చిన్న తోపుడు బండిపై పలావ్ తక్కువ ధరలో అమ్మడం ప్రారంభించిన సీతయ్య గారు,కొద్దికాలానికే వారి ఆహారానికి స్థానిక ప్రజల నుంచి విశేషమైన స్పందన పొందారు.
సీతయ్య గారి వంటకాలకు స్థానిక ప్రజల మద్దతు లభించడంతో చిన్న బండి మీద ప్రారంభమైన ప్రయాణం, క్రమంగా పెద్ద ఆహారశాల స్థాపనకు మార్గం చూపింది . భీమవరం ప్రాంతంలో సీతయ్య గారి పేరుకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. నేడు, వారి ఆహారశాల భీమవరంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రసిద్ధి చెందింది.
సీతయ్య గారి కథ ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుంది. నిరాశలో కూడా మన లక్ష్యాన్ని నమ్ముకుని, కృషి చేస్తే ఎలా విజయాన్ని సాధించవచ్చో ఆయన నిరూపించారు.
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: