నెల్లూరులో వాజ్ పాయ్ కాంస్య విగ్రహం.. ఆవిష్కరించిన కూటమి నేతలు..! - NDN News
Автор: NDN News
Загружено: 2025-12-15
Просмотров: 2658
నెల్లూరులో వాజ్ పాయ్ కాంస్య విగ్రహం..
ఆవిష్కరించిన కూటమి నేతలు..!
=====================
నెల్లూరు నగరం హరనాథపురం సర్కిల్ లో మాజీ ప్రధాని, భారతరత్న దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా అటల్.. మోదీ సుపరిపాలన బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య విగ్రహన్ని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. దేశంలో సుపరిపాలన, అభివృద్ధికి చిరునామాగా వాజ్ పేయి నిలిచిపోయారని నేతలు ప్రశంసించారు. అటల్ బిహారీ వాజ్ పేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపు రెడ్డి సురేష్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: