మంథని ఎమ్మెల్యే కల్లు తాగి మానీఫెస్టో రాయచ్చు
Автор: Telangana Voice
Загружено: 2025-10-10
Просмотров: 51
మంథని ఎమ్మెల్యే కల్లు తాగి మానీఫెస్టో రాయచ్చు....
బీసీ డిక్లరేషన్ పేరుతో మోసం చేసిన రేవంత్ సర్కార్
బీసీ మంత్రులై సీఎం..మంత్రి దుద్దిళ్ల కు వత్తాసు పలుకుడా
రిజర్వేషన్ లేటైనా డిక్లరేషన్ అంశాలు అమలు చేయచ్చుగా
రాబోయే రోజుల్లో బీసీలతోనే కాంగ్రెస్‌కు భూస్థాపితం తప్పదు
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌లతో పాటు మానీఫెస్టోను రాసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ అనాడు కల్లు తాగి మానీఫెస్టో రాసి ఉండవచ్చని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం మంథని పట్టణంలోని ఫూలే చౌక్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే పాదాలకు పూలు వేసి నివాళులు అర్పించి అనంతరం మీడియా తో ఆయన మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్‌లను 42శాతం ఇస్తామని ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్‌పేరుతో గొప్పగా కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య తీసుకువచ్చి సభ నిర్వహించి అనేక విషయాలను ప్రకటించారన్నారు. ఒక్క బీసీ డిక్లరేషన్ 42శాతమే కాదు అనేక విషయాలను పొందుపర్చారని ఆ మానీఫెస్టోకు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ చైర్మన్ అయితే రేవంత్‌రెడ్డి నాయకుడని అన్నారు. అయితే ఇప్పటి వరకు మానీఫెస్టో అమలు కాకపోవడాన్ని చూస్తుంటే కల్లు తాగి మానీఫెస్టో రాసిండా అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. బీసీ డిక్లరేషన్‌లో 42శాతం రిజర్వేషన్‌లు ఆరు నెలల్లోనే పెంచుతామని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు., రిజర్వేషన్‌ల విషయంలో అనేక ఆంక్షలు ఉండవచ్చని, రాజ్యాంగ బద్దంగా ఆలస్యం కావచ్చన్నారు. కానీ ఆరు నెలలలో ఎందుకు ప్రయత్నం చేయలేదని ఆయన ప్రశ్నించారు. బీసీ డిక్లరేషన్‌లో ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టుల్లో 42శాతం రిజర్వేషన్‌లు, బీసీ చిరు వ్యాపారులకు వ్యాపారాలు చేసుకునేందుకు రూ.10లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి 22నెలలైనా ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు, కేవలం ఇటు ప్రజలను అటు బీసీలను మోసం చేయడానికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌లు కుట్ర చేశారన్నారు. అంతేకాకుండా జనగామ జిల్లాకు సర్వాయి సర్థార్ పాపన్న పేరు పెడుతామని చెప్పిండ్లని, కానీ పీసీసీ అధ్యక్షులుగా ఉన్న మహేష్‌కుమార్ గౌడ్ మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గౌడ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే బీసీలు అయామకులు, తెలివితక్కువ వాళ్లని గ్రహించిన కాంగ్రెస్ 78ఏండ్ల తర్వాత కూడా భయపడకుండా రాజ్యం ఏలుతున్నారని అన్నారు. ఆనాడు సీఎం కేసీఆర్ హాయాంలో గౌడలకు మద్యం షాపుల్లో 15శాతం రిజర్వేషన్‌లు ఇచ్చారని, ప్రస్తుతం 25శాతం ఇస్తామని గొప్పలు చెప్పిండ్లే కానీ ఎక్కడా అమలు చేయలేదనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. అంతేకాకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ హాయాంలో మంథని ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ తనను సాధించాలని బీసీలను ఉసి గొల్పాలనే ఆలోచనతో మున్నూరు కాపు కార్పోరేషన్ కోరుకుంటున్నారని అన్నాడే తప్ప కావాలని చెప్పలేదన్నారు. అయినా బీసీ నాయకులు మాసారు గొప్పోడంటూ పాలాభిషేకాలు, సన్మానాలు చేశారన్నారు. కులగణన గొప్పగా చేశామని బీహార్‌లో చెప్పుకుంటూ అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని, కర్ణాటక, అస్సాం, తెలంగాణాలో మోసం చేస్తే మహారాష్ట్ర, హరియాణాలో ముఖం చెల్లని కాంగ్రెస్ ప్రస్తుతం బీహార్‌ను మోసం చేయాలని చూస్తుందన్నారు. ఆనాడు అర్డినెన్స్ తీసినం సరిపోతదని చెప్పి మళ్లీ గవర్నర్ దగ్గర ఉందన్నారని, మళ్లీ అది సరిపోతలేదని అసెంబ్లీలో బిల్లుపెట్టి ఇది పక్కగా ఉందని మంథని ఎమ్మెల్యే మాట్లాడినట్లు ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీల్లో ఒక్కో మంత్రి ఒక్కో విదంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆరు నెలల్లో బీసీ డిక్లరేషన్ 42శాతం రిజర్వేషన్‌లు ఇస్తామని 22నెలలైనా అతీగతీ లేదని ఆయన విమర్శించారు. ఇంత పెద్ద బీసీ సమాజాన్ని చులకనగా చూస్తున్నారంటే అందుకు దుద్దిళ్ల శ్రీధర్ కారణమన్నారు. మూడు ఓట్లు ఉన్న కుటుంబం ఈ సమాజాన్ని మాయచేసి వాడుకుంటుందని, ఎదిగిన వాళ్లను అణిచివేస్తూ అధికారం చేజిక్కించుకున్నారని అన్నారు. అయితే బీసీ సామాజికవర్గానికి చెందిన వారు మంత్రులుగా ఉండి కూడా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌లకు వత్తాసు పలుకడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బీసీ డిక్లరేషన్‌పై ఎవరూ కోర్టుకు వెళ్లవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పితే రేవంత్‌రెడ్డితో ఉండే వ్యక్తి కోర్టుకు పోయాడని, ఈ విషయంపై మంత్రి పొన్నం ఎందుకు మాట్లాడటం లేదన్నారు. చట్టాలు, మానీఫెస్టోలు తయారు చేస్తూ గొప్పోళ్లుగా కీర్తించబడుతుంటే మంత్రులై ఉండి కోర్టుకు పోయి అబాసుపాలు అవుతారా అని అన్నారు. రిజర్వేషన్‌లో ఆలస్యం అయినా మిగిలిన అంశాలను అమలు చేయచ్చు కదా అనిప్రశ్నించారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌లో రిజర్వేషన్, బ్రాండి షాపులో 25శాతం కు ఇబ్బంది ఏంటన్నారు. తమ మంత్రులను సైతం మోసం చేసే చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌లదే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన డిక్లరేషన్ అంతా మోసమేనని, దుద్దిళ్ల సొంత డిక్లరేషన్ చేసుకున్నాడని ఆయన విమర్శించారు. ఆనాడు పూలేను, అంబేద్కర్‌ను ఈ సమాజానికి అర్థం కాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీనేనని, అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలను మోసం చేస్తూనే ఉందన్నారు. రాబోయే రోజుల్లో బీసీలతో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాకతప్పదని ఆయన హెచ్చరించారు.

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: