నారాయణీయము దశకం - 1 | Narayaneeyamu Dasakam - 1
Автор: Dharmika Moolalu | ధార్మిక మూలాలు
Загружено: 2024-08-20
Просмотров: 49542
"శ్రీమన్నారాయణీయము"
వ్యాస విరచిత మహా భాగవత పురాణానికి సంక్షిప్త రూపమైన ఈ గ్రంథము అత్యంత మహిమాన్వితమైన స్తోత్రము.
దీనిని పారాయణ చేయుట వలన అఖండ ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి. దీనికి తార్కాణము-ఈ గ్రంథకర్త శ్రీ నారాయణా భట్టాద్రి 15వ శతాబ్దంలో కేరళలో జన్మించిన ఒక మహా భక్తుడు. పదహారేళ్ళ పిన్న వయసులోనే మహా మేధావిగా, సకల శాస్త్రాలను, వేద వేదాంగాలను అవుపోసన పట్టినట్లుగా చెబుతారు. తన 27 ఏట ఆయన వ్యాకరణ గురువైన అచ్యుతాచార్యులకు గురు శుశృూష చేస్తూ అప్పుడు ఆయనకు సంక్రమించిన పక్షవాత రోగాన్ని తనకు ఇచ్చి గురువుకు ఆరోగ్యం ప్రసాదించమని భగవంతుని వేడుకుని, ఆ విధంగా తనకు వచ్చిన ఆరోగం కాళ్లు చేతులు కదల్చలేని భట్టద్రి గారు గురువాయూరు కృష్ణ భగవానుని ఆయన కోవెలలోనే నివసిస్తూ తన రోగం నయం చేయమని శ్రీకృష్ణుని 100 రోజులు 100 దశకాలుగా రచిస్తూ ప్రార్థించారు. ఆఖరు రోజు ఆ మహాత్మునికి భగవత్ దర్శనం కలిగి, ఆరోగ్యం చేకూరి పూర్ణాయుస్మంతుడై 106 సంవత్సరాల వరకు భట్టాద్రి గారు జీవించారని చెబుతారు.
శరీరాన్ని మనసును పీల్చి పిప్పి చేసిన వేదన నుండి ఉద్భవించి భారతీయ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే మహాభక్తి కావ్యమే " శ్రీమన్నారాయనీయము"
ప్రథమదశకమ్ (౧) – భగవతః స్వరూపం తథా మాహాత్మ్యమ్
సాన్ద్రానన్దావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానమ్ |
అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మ తత్త్వం
తత్తావద్భాతి సాక్షాద్గురుపవనపురే హన్త భాగ్యం జనానామ్ || ౧-౧ ||
ఏవందుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్
తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయమ్ |
ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై
నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః || ౧-౨ ||
సత్త్వం యత్తత్పురాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్-
భూతైర్భూతేన్ద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యమ్ |
తత్స్వచ్ఛత్వాద్యదచ్ఛాదితపరసుఖచిద్గర్భనిర్భాసరూపం
తస్మిన్ ధన్యా రమన్తే శ్రుతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే || ౧-౩ ||
నిష్కమ్పే నిత్యపూర్ణే నిరవధిపరమానన్దపీయూషరూపే
నిర్లీనానేకముక్తావలిసుభగతమే నిర్మలబ్రహ్మసిన్ధౌ |
కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్త్వమాహుస్తదాత్మా
కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచస్త్వత్కలాస్వేవ భూమన్ || ౧-౪ ||
నిర్వ్యాపారోఽపి నిష్కారణమజ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం
తేనైవోదేతి లీనా ప్రకృతిరసతికల్పాఽపి కల్పాదికాలే |
తస్యాః సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్త్వరూపం
స త్వం ధృత్వా దధాసి స్వమహిమవిభవాకుణ్ఠ వైకుణ్ఠ రూపమ్ || ౧-౫ ||
తత్తే ప్రత్యగ్రధారాధరలలితకలాయావలీకేలికారం
లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారమ్ |
లక్ష్మీనిశ్శఙ్కలీలానిలయనమమృతస్యన్దసన్దోహమన్తః
సిఞ్చత్సఞ్చిన్తకానాం వపురనుకలయే మారుతాగారనాథ || ౧-౬ ||
కష్టా తే సృష్టిచేష్టా బహుతరభవఖేదావహా జీవభాజా-
మిత్యేవం పూర్వమాలోచితమజిత మయా నైవమద్యాభిజానే |
నోచేజ్జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ద్రం
నేత్రైః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంభోధిపూరే రమేరన్ || ౧-౭ ||
నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్థితాన-
ప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానన్దసాన్ద్రాం గతిం చ |
ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధికఫలః పారిజాతో హరే త్వం
క్షుద్రం తం శక్రవాటీద్రుమమభిలషతి వ్యర్థమర్థివ్రజోఽయమ్ || ౧-౮ ||
కారుణ్యాత్కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషా-
దైశ్వర్యాదీశతేఽన్యే జగతి పరజనే స్వాత్మనోఽపీశ్వరస్త్వమ్ |
త్వయ్యుచ్చైరారమన్తి ప్రతిపదమధురే చేతనాః స్ఫీతభాగ్యా-
స్త్వం చాత్మారామ ఏవేత్యతులగుణగణాధార శౌరే నమస్తే || ౧-౯ ||
ఐశ్వర్యం శఙ్కరాదీశ్వరవినియమనం విశ్వతేజోహరాణాం
తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతమ్ |
అఙ్గాసఙ్గా సదా శ్రీరఖిలవిదసి న క్వాపి తే సఙ్గవార్తా
తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్ఛబ్దముఖ్యాశ్రయోఽసి || ౧-౧౦ ||
#నారాయణీయము #నారాయణీయం#Narayaneyam #నారాయణస్వరూపం #దశకములు #భక్తిగీతాలు #హిందూమతం #ప్రపంచసాంప్రదాయం #SanatanaDharma #SpiritualJourney #NarayanaBhakti
#Narayaneyamu #Dashakam #Narayana #Bhakti #HinduScriptures #DevotionalMusic #SanatanaDharma #SpiritualAwakening #NarayanaDevotion #hindutraditions
#bhakthiSongs #bhajanBhakthiPatalu #krishnaBhakthiSongs #teluguDevotionalStories #dailyBhajans #devotionalVideoSongsTelugu #bhajanKeerthanalu #bakthiSongsTelugu #devotionalTeluguFolkSongs #bhakthiChannelPatalu #devotionalSongsOfGod #lordKrishnaBhajansTelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: