తిరుమలవాసా శ్రీ శ్రీనివాసా కావగరావయ్యా//, తెలుగు భజన పాటలు //, devotional songs
Автор: vvreddy
Загружено: 2024-03-15
Просмотров: 7442
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
గోకులంలో సీత సినిమాలో గోకుల కృష్ణా-గోపాలకృష్ణా పాట స్టైల్
తిరుమలవాసా శ్రీ శ్రీనివాసా కానగరావయ్యా
నీ సన్నిధిలో నిలిచిన దీనుల కావగ రావయ్యా
కలియుగ దైవముగా వెలసిన ఓ దేవా
పిలిచితి మనసారా పలుకగ రాలేవా
హరి శరణు శరణు శరణు శరణు శరణు భజే
పాపాలు బాపే నీ దివ్యక్షేత్రము కలిలోన వెలిసే వైకుంఠము
మాపాలి దైవమై ఇలలోన శిలగా నీవవతరించిన పుణ్యతీర్ధము
నీ పద స్మరణతొ ఈ గిరులే పులకించేనయా
నీ పూజలతో మా మనసే పరవశమందెనయా
కోపము బూనకమా తాళగలేమయ్యా
ఆపదలీడేర్చే అందరి బంధువయా
హరి శరణు శరణు శరణు శరణు శరణు భజే
నీ మ్రొక్కుతీర్చగా ముడుపులు కట్టగా నీ కొండ చేరగా వచ్చినామయా
నీ ముద్దు మోమును చూపించలేవా మేలుకొని మమ్ము ఏలుకోవయా
నీ చరణాలే కొలిచాము శ్రీధర గోవిందా
నీ సేవలనే చేసాము శ్రీకర దయరాదా
నీవే తలిదండ్రి గురువు దైవమయా నీ నామం నిరతం తలచెద ప్రాణమయా
హరి శరణు శరణు శరణు శరణు శరణు భజే
వైకుంఠవాసుడా శ్రీ వేంకటేశుడా కోనేటిరాయడా కరుణ చూపరా
వేదాంతవేద్యుడా సురలోక పూజ్యుడా ఆరాధ్యదేవుడా అభయమీయరా
వేయి నామాలవాడవు ఆశ్రిత మందారా
వరముల నొసగే శ్రీవిభుడా నిన్నే నమ్మితిరా
వేడితి నిను చేరి వేదన తీర్చుమురా వందనమిది గొనరా అప్పన్నదాసునిరా
హరి శరణు శరణు శరణు శరణు శరణు భజే
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: