'పారిశ్రామికభివృద్ధిలో రాష్ట్రం వెనుకబాటు' ఎంబి స్మారకోపన్యాసంలో BV Raghavulu || CPIM AP
Автор: CPIM AP
Загружено: 2025-12-21
Просмотров: 382
పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడి ఉందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్‌వికె) చైర్మన్, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సిపిఎం అగ్రనేత, మాకినేని బసవపున్నయ్య జయంతి సందర్భంగా ‘ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికీకరణ తీరుతెన్నులు-రాష్ట్రప్రభుత్వ విధానాలు’ అనే అంశంపై శనివారం రాత్రి విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. ఎంబివికె చైర్మన్ పి మధు అధ్యక్షతన శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాఘవులు స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు భూస్వామ్య మనస్థత్వంతో పారిశ్రామిక అవకాశాన్ని వినియోగించుకోకపోవడమే రాష్ట్ర వెనుకబాటుకు కారణమని చెప్పారు. సమాన అభివృద్ధి జరగాలంటే పెట్టుబడీదారిడిని శాసించి, నియంత్రించి రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా వారిచేత చేయించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని పాలకులు స్వతంత్ర శక్తి లేకపోవడంతో పెట్టుబడీదారుల చుట్టూ తిరుగుతున్నారని, పైకి మాత్రం తామే వారిని నడిపిస్తున్నామని చెబుతున్నారని అన్నారు. సిఐఐ పేరుతో టిడిపి, వైసిపి ప్రభుత్వంలో నిర్వహించిన సదస్సుల్లో లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు
తప్పితే ఆచరణలో రావడం లేదన్నారు. భూములు తీసుకుంటున్నారు కానీ, పరిశ్రమలు రావడం లేదని చెప్పారు. లేపాక్షి పేరుతో 8వేల ఎకరాలు, కాకినాడలో 8వేల ఎకరాలు, అనిల్ అంబానీకి కృష్ణపట్నం ఓడరేవు దగ్గర వేల ఎకారలు ఇచ్చారని అప్పగించారని, కానీ ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో చివరి స్థానంలో రాష్ట్రం ఉందన్నారు. అవసరమైన స్కిల్ పవర్, మ్యాన్ పవర్ సాధించకుండా పారిశ్రామిక అభివృద్ధి జరగదన్నారు. దేశంలో ధరలు పడిపోవడంతో పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక విడుదల చేసిందన్నారు. వెనుకబడ్డ ప్రాంతాలను ప్రభుత్వ రంగ పరిశ్రమల ద్వారా అభివృద్ధి చేయాలనే దృష్టితో పాలకులు ఇప్పటికీ ప్రయత్నించడం లేదన్నారు. రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం 1980వ దశకంలో పంచవర్ష ప్రణాళిక పేరుతో కొంత ప్రయత్నం చేసిందని రాఘవులు చెప్పారు. అప్పుడు కూడా రాష్ట్రంలో ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదన్నారు. పెట్టుబడీదారుల ప్రభావంతో ఓడరేవులు ఉన్న చోటే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పారని అన్నారు. ఆ సమయంలో కూడా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదన్నారు. 1997లో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటివో) ప్రారంభమైన తరువాత 2శాతంగా ఉన్న ప్రపంచ వ్యాపారం దాదాపు 12శాతానికి పైగా పెరిగిందన్నారు. ఎగుమతులకు అవసరమైన ఉత్పత్తులు చేసి, ఓడరేవులను అభివృద్ధి చేసుకున్న రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థ ముందుకు వెళ్ళిందని చెప్పారు. రాష్ట్రంలో ఓడరేవుల అభివృద్ధి పేరుతో హడావుడి చేసి వేల ఎకరాలు సేకరించారని వివరించారు.ఆ సమయంలోనే ఓడరేవుల అభివృద్ధి దృష్టిసారించాలని సిపిఎం డిమాండ్ చేసిందన్నారు. చంద్రబాబు మాత్రం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.10వేల కోట్లు అప్పు తీసుకొచ్చి రోడ్ల అభివృద్ధి చేశారని, ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సింగపూర్ నమూనా పేరుతో అమరావతి పేరుతో హడావుడి చేశారని తెలిపారు. శాశ్వత అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలు కూడా చేయలేదన్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ విశాఖపట్నం అంటూ అమరావతిని పట్టించుకోలేదన్నారు. రాజధాని ఇలా అవ్వడానికి చంద్రబాబు, జగనే కారణం అని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు మరోసారి రాజధాని కోసం 20వేల ఎకరాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.గతంలో సిఇవో అని తగిలించుకున్న చంద్రబాబు ఇప్పుడు బెస్ట్ బిజినెస్ రీఫార్మర్ అని తగిలించుకుంటున్నారని తెలిపారు. డేటా సెంటర్లు నీటి బుడగలు వంటివని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ వెనుక అదానీ ఉన్నారని చెప్పారు. ఇది వస్తుందా? లేదో చెప్పలేమన్నారు. డేటా సెంటర్ గతంలో జరిగిన డాట్‌కమ్ బూమ్ వంటిదని, కాబట్టి ఇది కూడా అలానే పేలే అవకాశం ఉందన్నారు. ఎంబివికె వార్షిక నివేదికను కార్యదర్శి పి మురళీకృష్ణ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో ఎంబివికె ట్రస్ట్ కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జ్ తులసీరావు, సభ్యులు స్వరూపరాణి పాల్గొన్నారు. This Channel about Communist Party Of India (Marxist) [CPIM]
All videos are about #AndhraPradesh politics and indian politics
#appolitics #cpimap
కొత్త కొత్త వీడియోస్ కోసం మా CPIM AP యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంటను 🔔 క్లిక్ చేయండి.
---------------*----------------*----------------*----------------
Like 👍 , comment, share and Subscribe to your CPIM AP YouTube Channel...
Follow our social media sites...
Facebook : / cpimap
YouTube : / cpimap
Twitter : / cpimap
Web Site : https://www.cpimap.org/
------------------------*------------------------*-------------------------*--------------------------
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: