నాగరాజు ఫ్యామిలీ ద్వారా మాకు ప్రాణహాని ఉందని మాకు న్యాయం చేయాలని కోరారు
Автор: Mana Nizamabad
Загружено: 2024-11-04
Просмотров: 218
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సామల కవిత దామోదర్. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36 వార్డులో సామల కవిత నాగరాజు కొత్తగా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇంటి పక్కన గల ఆకుల నాగరాజు అతను భార్య వారి ఇద్దరు కుమారులు దాడి పాల్పడుతున్నారని ఆరోపించారు. 6 లక్షలు రూపాయలను ఇవ్వాలని ఆకుల నాగరాజు డిమాండ్ చేసారని అన్నారు. అందుకు నిరకరించడంతో మమల్ని ఇబ్బంది లకు గురిచేస్తున్నారు.ఇంటి పని చేసే మేస్త్రి లను బూతుమాటలతో తిట్టడం జరగగా ఎందుకు తిడుతున్నారని అడగడంతో నా పై ఆ నలుగురు దాడిచేసారు. అందుకే ప్రజావాణి లో పిర్యాదు చేశాము అన్నారు.ఇల్లు నిర్మించినప్పటి నుండి ప్రతిరోజు కావాలని గొడవ చేస్తున్నాడని, డబ్బులు ఇవ్వకపోతే ఇంటి నిర్మాణం జరగకుండా చేస్తామని అంటున్నారని అన్నారు. నన్ను కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్లీ నా దగ్గరికి రావాల్సిందేనని అంటున్నాడని అన్నారు. మా దగ్గర మేము ప్లాట్ కోన్నటువంటి ఇంటి పేపర్లు ఉన్నాయని దాని ప్రకారమే మున్సిపల్ నుండి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోవడం జరుగుతుందని దయచేసి జిల్లా కలెక్టర్ అధికారులు మాకు న్యాయం చేయగలరని, నాగరాజు ఫ్యామిలీ ద్వారా మాకు ప్రాణహాని ఉందని మాకు న్యాయం చేయాలని కోరారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: