CHUDU CHUDU DURGAMMA CHUDU SONG,9494 73 5757 , 9908509251
Автор: 𝑺𝑹𝑰𝑵𝑰𝑽𝑨𝑺 𝑺𝑾𝑨𝑴𝒀 𝑶𝑭𝑭𝑰𝑪𝑰𝑨𝑳
Загружено: 2024-10-03
Просмотров: 37992
PLEASE DO LIKE , SHARE AND SUBSCRIBE TO MY CHANNEL
చూడు చూడు దుర్గమ్మ చూడు
పల్లవి:-
చూడు చూడు దుర్గమ్మ చూడు, భక్తులనడుమ భవాని చూడు ....(2)
చరణం:-
1)నిమ్మకాయ దండలు - నిలువెత్తు వేయంగ
గుబ్బీల పొగలు - గుంపుగ రావంగ (2)
సాంబ్రాణి దూపం చక్కగ వేయంగ చూడు చూడు
||చూడు చూడు||
2)బంగారు బిందెల్లా - గంగ నీళ్ళు తెచ్చి
అమ్మా భవానికి - అభిషేకం చెయ్యంగా (2)
చల్లటి నీళ్ళని సంబరపడుతుంది చూడు చూడు
||చూడు చూడు||
3)భక్తులంతా కూడి - భజనలు చేయంగా
ఆటలాడి అమ్మవారి - పాటలు పాడంగా (2)
కనిపించకుండవచ్చి కాలు కదుపుతున్నది చూడు చూడు
||చూడు చూడు||
4)అమ్మ పాదాలకు - పారాణి పూయంగా
ఆడపడుచులంతా - హారతులివ్వంగా (2)
హారతులివ్వంగ ఆనందపడుతుంది చూడు చూడు
||చూడు చూడు||
5) గండా దీపాలు - నూటొక్క పొద్దులు
వేప కొమ్మలు - దూప దీపాలు (2)
దీపా కాంతుల్లో దగ దగ మెరుస్తుంది చూడు చూడు
||చూడు చూడు||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: